అన్వేషించండి

Andhra Pradesh Job Calendar : ఆంధ్రప్రదేశ్ యువతకు గుడ్ న్యూస్! జాబ్ క్యాలెండర్ విడుదల, ఉద్యోగాల జాతర, నైపుణ్య పోర్టల్ ప్రారంభం!

యూనివర్శిటీలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీని వల్ల విద్యాబోధనకు ఆటంకం కలుగుతోందని గుర్తించిన మంత్రి వెంటనే ఆ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Andhra Pradesh Job Calendar : ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఉగాది పండుగ నాటికి జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయనున్నట్టు రాష్ట్ర విద్యా,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రకటించారు. గురువారం ఉండవల్లిలోని తన నివాసంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ కీలక నిర్ణయాలు వెల్లడించారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టులను భర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

యూనివర్శిటీల్లో కొలువుల జాతర

చాలా కాలంగా రాష్ట్రంలోని యూనివర్శిటీలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీని వల్ల విద్యాబోధనకు ఆటంకం కలుగుతోందని గుర్తించిన మంత్రి వెంటనే ఆ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డిగ్రీ కాలేజీలు, యూనివర్శిటీల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఇది విద్యాశాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి పెద్ద ఊరటనిచ్చే అంశం. 

విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

కేవలం ఉద్యోగులే కాకుండా విద్యార్థుల సంక్షేమంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. ముఖ్యంగా కోచింగ్ సెంటర్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడి, మానసిక సమస్యల వల్ల జరుగుతున్న ఆత్మహత్యలను నివారించాలని మంత్రి లోకేష్‌ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా కోచింగ్ సెంటర్లపై నియంత్రణ ఉండాలని, విద్యార్థులకు మానసిక ప్రశాంతతనిచ్చే వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇందు కోసం ప్రత్యేక విధి విధానాలు రూపొందించాలని కోరారు. 

ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలే లక్ష్యం 

రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామని, భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి తెలిపారు. ఈ ఏడాది గ్రౌండ్ అయిన పరిశ్రమల ద్వారా సుమారు రెండు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రిలయన్స్‌, సీబీఐ, జూపిటర్, లారెన్స్‌, ఫార్మా, హెటెరో డ్రగ్స్‌ వంటి దిగ్గజ సంస్థలతోపాటు కొత్తగా వస్తున్న రెన్యువబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారా యువతకు ఉపాధి లభించనుంది. ఈ ప్రాజెక్టులకు అవసరమైన నైపుణ్యాలను గుర్తించి, యువతకు తగిన శిక్షణ ఇవ్వాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. 

త్వరలో నైపుణ్యం పోర్టల్‌ ప్రారంభం 

యువతకు ఉద్యోగ సమాచారం, శిక్షణను ఒకే చోట అందించేందుకు నైపుణ్యం పోర్టల్‌ను త్వరలోనే ప్రారంభించనున్నారు. ఈ పోర్టల్‌ ద్వారా 25 రంగాలకు సంబంధించిన డేటా ఇంటిగ్రేషన్ ఇప్పటికే పూర్తయింది. ఇందులో సుమారు 1, 14, 899 ఉద్యోగ అవకాశాలు ఉన్నట్టు గుర్తించారు. విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే వారికి కోసం 3,100 అంతర్జాతీయ ఉద్యోగాలను కూడా సిద్ధం చేశారు. అంతర్జాతీయ రిక్రూటింగ్‌ ఏజెన్సీలు కూడా ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. 

ఏఐతో ఇంటర్వ్యూలు- నియోజకవర్గ స్థాయిలో శిక్షణ

ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా ఉద్యోగ నియామక ప్రక్రియలో మార్పులు తెస్తున్నారు. ఇప్పటికే ట్రయల్ బేసిస్‌లో 20వేల మంది విద్యార్థులకు , 60 వేల మంది జాబ్ సీకర్లు ఏఐ ఆధారిత ఇంటర్వ్యూలు నిర్వహించినట్టు అధికారులు వెల్లడించారు. యువతకు నైపుణ్య శిక్షణను చేరువ చేసేందుకు ప్రతి నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని, వాటికి ఇప్పటికే ఉన్న శిక్షణ కేంద్రాలకు అనుసంధానించాలని మంత్రి ఆదేశించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

UPSC Result 2025: రైలు ప్రమాదంలో అవయవాలు పోగొట్టుకున్నా రెండుసార్లు UPSC క్రాక్‌ చేసిన సూరజ్ తివారీ! 
రైలు ప్రమాదంలో అవయవాలు పోగొట్టుకున్నా రెండుసార్లు UPSC క్రాక్‌ చేసిన సూరజ్ తివారీ! 
UPSC Civil Services Result: యూపీఎస్సీ సివిల్స్ టాపర్‌గా అనూజ్ అగ్నిహోత్రి.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
UPSC సివిల్స్ టాపర్‌గా అనూజ్ అగ్నిహోత్రి.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
ABP Desam Smart ED Conclave 2026: ఉద్యోగాలు లేవనేది అపోహేనా? AI యుగంలో విద్యార్థులు ఎలా సిద్ధమవ్వాలి? ప్రొఫెసర్ బాలకిష్టా రెడ్డి కీలక సూచనలు!
ఉద్యోగాలు లేవనేది అపోహేనా? AI యుగంలో విద్యార్థులు ఎలా సిద్ధమవ్వాలి? ప్రొఫెసర్ బాలకిష్టా రెడ్డి కీలక సూచనలు!
AI career certificate: గూగుల్ సరికొత్త ఏఐ కెరీర్ సర్టిఫికేట్ - రేపటి టెక్ ఉద్యోగాలకు ఇదే రహదారి!
గూగుల్ సరికొత్త ఏఐ కెరీర్ సర్టిఫికేట్ - రేపటి టెక్ ఉద్యోగాలకు ఇదే రహదారి!
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Strait Of Hormuz Conflict: హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
Droupadi Murmu Protocol Row: తనను అవమానించారన్న ముర్ము, ప్రధాని మోదీ ఆగ్రహం- ప్రొటోకాల్ ఉల్లంఘించలేదన్న మమతా బెనర్జీ
తనను అవమానించారన్న ముర్ము, ప్రధాని మోదీ ఆగ్రహం- ప్రొటోకాల్ ఉల్లంఘించలేదన్న మమతా బెనర్జీ
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
Anakapalli Crime News: అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
Team India Playing 11: ఫైనల్ నుంచి మిస్టరీ స్పిన్నర్ ఔట్.. వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్ యాదవ్‌కు ఛాన్స్ !
ఫైనల్ నుంచి మిస్టరీ స్పిన్నర్ ఔట్.. వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్ యాదవ్‌కు ఛాన్స్ !
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
Iran-Israel Conflict: కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
India vs New zealand Final Toss: ఫైనల్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. ఫస్ట్ బ్యాటింగ్ టీమిండియాదే.. ప్లేయింగ్ 11 టీమ్స్
ఫైనల్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. ఫస్ట్ బ్యాటింగ్ టీమిండియాదే.. ప్లేయింగ్ 11 టీమ్స్
Embed widget