CM Chandrababu: ఉగాది నాడు పేదలకు గుడ్‌న్యూస్, కీలక ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం
Andhra Pradesh News | తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు.. అనంతరం పేదలకు శుభవార్త చెప్పారు. నిధుల విడుదలకు సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు.

అమరావతి: పేదలకు సాయం అందించేందుకు ఉగాది రోజున ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి ఫైలుపై చంద్రబాబు తొలి సంతకం చేశారు. రూ.38 కోట్లు విడుదలకు ఆమోదం తెలిపారు. దీంతో 3,456 మంది పేదలకు లబ్ధి కలుగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పటివరకు 23,418 మంది పేదలకు రూ.281.38 కోట్లను ప్రభుత్వం అందించింది.
తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు
విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వచ్చేవన్నీ మంచి రోజులనే సానుకూల దృక్పథంతో కొత్త ఏడాదిని స్వాగతిద్దాం అన్నారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ రాబోయే కాలంలో గణనీయమైన ప్రగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. విశ్వావసు నామ సంవత్సరం తెలుగు ప్రజలందిరిలో సంతోషాన్ని నింపాలని, సకల విజయాలను అందించాలని చంద్రబాబు మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ప్రతి ఒక్కరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వచ్చేవన్నీ మంచి రోజులనే సానుకూల దృక్పథంతో కొత్త ఏడాదిని స్వాగతిస్తాం. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. మీ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ రాబోయే కాలంలో గణనీయమైన ప్రగతి సాధించాలని మనస్ఫూర్తిగా… pic.twitter.com/TtW5q306vs
— N Chandrababu Naidu (@ncbn) March 30, 2025
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

