By: Shankar Dukanam | Updated at : 30 Mar 2025 04:45 PM (IST)
దేశంలో సగం మంది దగ్గర 3.5 లక్షలు కూడా లేవు, ప్రపంచంలో 90 శాతం మందికి జీతం టెన్షన్..! ( Image Source : ABPLIVE AI )
భారతదేశంలో సగం మంది ప్రజల వద్ద రూ.3.5 లక్షలు కూడా లేవు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 90 శాతం మంది ఒక్క నెల జీతం రాకపోతే వారు ఉండలేరని చెన్నైకి చెందిన ఫైనాన్షియల్ ప్లానర్ డి ముత్తుకృష్ణన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI), ఆటోమేషన్ వైపు చూస్తున్న సమయంలో ప్రపంచంలో ఈ సమస్య తీవ్రతరం అవుతుందని హెచ్చరించారు. ముత్తుకృష్ణన్ వరుస పోస్ట్‌లలో కఠినమైన వాస్తవాలను బహిర్గతం చేశాడు. సంపద కొందరి వద్దే ఉండటం, సాంకేతిక, ఆర్థిక పలు ఇతర కారణాలతో భవిష్యత్తు మరింత దారుణంగా ఉండబోతోందని తన పోస్టులలో రాసుకొచ్చారు.
ఒక్క శాతం మంది వద్ద 1 మిలియన్ డాలర్లు
ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాలలో కూడా ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయని తెలిపారు. ధనిక దేశాలు ఉన్నప్పటికీ చాలా తక్కువ మంది ధనవంతులు ఉన్నారు. ప్రపంచంలో వయోజనుల జనాభాలో కేవలం 1 శాతం మంది మాత్రమే $1 మిలియన్ (8.6 కోట్లు రూపాయలు) కంటే ఎక్కువ నగదు కలిగి ఉన్నారని తెలిపారు. ప్రపంచ జనాభాలో కేవలం 10 శాతం మంది మాత్రమే జీతం అంతగా ఆధారపడి ఉండటం లేదు. మిగతా 90 శాతం మంది ఒక్క నెల జీతం రాకున్నా వాళ్లు ఆ నెల గడపలేరని పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. టెక్నాలజీతో భవిష్యత్తులో సమస్యలు తప్పవని, ఏఐ, ఆటోమేషన్, రోబోల వినియోగంతో ప్రపంచం ముందు మరిన్ని సవాళ్లు ఉత్పన్నం అవుతాయని ముత్తుకృష్ణన్ అభిప్రాయపడ్డారు.
స్విట్జర్లాండ్ విషయానికొస్తే అక్కడ కేవలం ఒక శాతం మంది వద్దే దేశ సంపదలో 43 శాతం వాటా కలిగి ఉన్నారు. టాప్ 7 శాతం మంది వద్ద దేశ సంపదలో 70 శాతానికి మించి కలిగి ఉన్నారు. అసమానత అనేది ప్రతిచోటా ఉంటుంది. అయితే సగటు సంపద పరంగా చూస్తే ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా స్విట్జర్లాండ్ ఉంది. ఆ దేశంలో ప్రతి వయోజనుడుు పేరిట సగటున $685,000 (సుమారు ₹6 కోట్లు) ఆస్తి కలిగి ఉన్నారని ముత్తుకృష్ణన్ వెల్లడించారు.
There are rich countries, but very less rich people in the world. Only around 1% of the world adult population owns more than $1 million ( Rs 8.6 crores).
— D.Muthukrishnan (@dmuthuk) March 30, 2025
Not including primary residence, if your wealth is Rs.90 lakhs or more, you are richer than 50% of Singaporeans.
Likewise,… pic.twitter.com/mPpXKQyRFh
సగటు సంపద విషయానికొస్తే స్విట్జర్లాండ్ లో సగం మంది వద్ద $167,000 (₹1.4 కోట్లు) కంటే తక్కువ నగదు ఉంది. ప్రపంచంలో అందరు వ్యక్తుల సగటు సంపద $8,654 డాలర్లు కాగా, ప్రపంచంలోని సగం మంది వద్ద 7.5 లక్షల కంటే తక్కువ నగదు కలిగి ఉన్నారు. భారత్‌లో సగటు సంపద దాదాపు $4,000 డాలర్లు కాగా సగం మంది ప్రజలు వద్ద 3.5 లక్షల కంటే తక్కువ మొత్తాన్ని కలిగి ఉన్నారు.
యూబీఎస్ గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ 2024ను ప్రస్తావించిన ముత్తుకృష్ణన్ ప్రపంచ సంపద పంపిణీ అనేది చాలా మంది అంతకంటే తక్కువే ఉందని స్పష్టం చేశారు. అమెరికా, స్విట్జర్లాండ్ లాంటి దేశాలు అధిక సగటు సంపదను కలిగి ఉన్నా, సూక్ష్మంగా పరిశీలిస్తే చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఉదాహరణకు అమెరికాను తీసుకుంటే సగటు సంపన్న దేశాలలో నాల్గవ స్థానంలో ఉండగా.. వ్యక్తుల వద్ద సగటు సంపద సూచీలో 14వ స్థానానికి పడిపోయింది.
Investment Plan: 1000 రూపాయల SIPతో కోటిన్నర తిరిగిచ్చిన SBI - మీరూ కావచ్చు కోటీశ్వరుడు!
Gold-Silver Prices Today 06 April: గోల్డ్ రేటు ఇంకా తగ్గుతుందా? - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
PF Money Withdrawl: పీఎఫ్ విత్‌డ్రా ఇప్పుడు ఇంకా ఈజీ, ఆ కీలక రూల్ రద్దు
Aadhaar Linking: ఆధార్‌తో ముడిపెట్టాల్సిన మూడు కీలక విషయాలు - ఇబ్బందులు మీ దరి చేరవు
Top 10 Govt Schemes: ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన టాప్-10 ప్రభుత్వ పథకాలు - అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలు!
Andhra Pradesh News: ముంబై ఎయిర్ పోర్టులో వైసీపీ నేత అంజాద్ బాషా సోదరుడు అరెస్ట్
Sunrisers Hyderabad vs Gujarat Titans: ఉప్పల్‌లో సన్‌రైజర్స్ వర్సెస్ గుజరాత్, ఆధిపత్యం చెలాయించింది ఎవరు, రికార్డులు ఇవీ
Peddi Vs Paradise: రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది - నాని 'ప్యారడైజ్' కూడా అప్పుడే.. ఫ్యాన్స్‌కు నిజంగా పండుగే..
Ayodhya Surya Tilak: అయోధ్యలో అద్భుత దృశ్యం, రామనవమి నాడు బాలరాముడికి సూర్యతిలకం- వీడియో చూశారా