Sreeleela : హిందీ 'జేజెమ్మ'గా యంగ్ బ్యూటీ? - టాలీవుడ్ ఫేమస్ ప్రొడ్యూసర్ సమర్పణలో...
Arundhati Remake : టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ 'అరుంధతి' మూవీని హిందీ రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది. హిందీ జేజెమ్మగా టాలీవుడ్ యంగ్ బ్యూటీ నటించనున్నట్లు సమాచారం.

Sreeleela Takes On The Lead Role In The Hindi Remaki Of Arundhati Movie : అరుంధతి... ఇండస్ట్రీకే ఓ సరికొత్త ఉత్సాహం తెచ్చిన హారర్ ఫాంటసీ మూవీ. స్వీటీ అనుష్క కెరీర్‌నే మలుపు తిప్పిన సినిమా. జేజెమ్మగా అనుష్క యాక్టింగ్‌కు టాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. 'వదల బొమ్మాళీ... వదలా' అంటూ పశుపతి క్యారెక్టర్‌లో సోనూసూద్ డైలాగ్స్ వేరే లెవల్. ఈ మూవీని మల్లెమాల ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించగా... స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. 2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది.
బాలీవుడ్ 'జేజెమ్మ'గా శ్రీలీల
ఇప్పుడు ఈ మూవీని బాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో ఈ వార్తలు వస్తున్నప్పటికీ ప్రస్తుతం రీమేక్‌కు ట్రాక్ పడిందనే టాక్ వినిపిస్తోంది. హిందీ జేజెమ్మగా యంగ్ బ్యూటీ శ్రీలీల నటించనున్నట్లు సమాచారం. 'శ్రీలీల' జేజెమ్మగా హిందీలో అరుంధతిని రీమేక్ చేసేందుకు ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారని ఫిలింనగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టుకు తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తారనే ప్రచారం సాగుతోంది. మరి దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. 16 ఏళ్ల తర్వాత 'అరుంధతి'ని రీమేక్ చేస్తారా? అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
రీసెంట్‌గా 'జూనియర్' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు శ్రీలీల. ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ 'మాస్ జాతర'తో పలకరించబోతున్నారు. ఈ నెల 31న 6 గంటల ప్రీమియర్స్‌తో మూవీ రిలీజ్ కానుంది. ఇక పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్‌లోనూ హీరోయిన్‌గా చేస్తున్నారు. దీంతో తమిళంలోనూ మూవీస్‌తో బిజీగా ఉన్నారు.





















