అన్వేషించండి

Andhra Pradesh Cyclone Compensation : తుపాను మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు పరిహరం - ప్రభుత్వం కీలక ప్రకటన

Andhra Pradesh Cyclone Compensation :మొంథా తుపానుతో జరిగిన పంట నష్టం వివరాలు 5 రోజుల్లో ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. 24 గంటల్లోగా పునరావాస శిబిరాల్లో కుటుంబాలకు రేషన్ అందించాలని సూచించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Andhra Pradesh Cyclone Compensation :"మొంథా" తుపాన్‌తో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఐదు రోజుల్లోగా పంట నష్టానికి సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వ్యవసాయ శాఖ సిబ్బంది పంట నష్టం వివరాలను త్వరగా సేకరించేలా చూడాలని స్పష్టం చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి, వాటిని కాపాడేందుకు గల అవకాశాలపై రైతులకు తగు సూచనలు చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.

Image

బుధవారం ఉదయం మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి, పర్యటన అనంతరం సాయంత్రం సచివాలయంలోని ఆర్టీజీ కేంద్రంలో తుపాన్ వల్ల సంభవించిన నష్టంపైనా, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపైనా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు సేకరించిన సమాచారం వరకు పరిశీలిస్తే... రాష్ట్రంలోని 304 మండలాల్లోని 1,825 గ్రామాల్లో 87 వేల హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లిందని, ఇందులో 59 వేల హెక్టార్లకుపైగా విస్తీర్ణంలో వరి పంటతోపాటు, ప్రత్తి, మొక్కజొన్న, మినుము వంటి పంటలు నీట మునిగినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 78,796 మంది రైతులు నష్టపోయారని తెలిపారు. అలాగే 42 పశువులు చనిపోయినట్టు చెప్పారు. అయితే ఇది ప్రాథమికంగా ఉన్న అంచనాలు మాత్రమేనని క్షేత్ర స్థాయిలో పరిస్థితులను చూస్తుంటే తుపాన్ ప్రభావం వల్ల జరిగిన నష్టం ఇంకా పెరిగేలా ఉందని అధికారులు వెల్లడించారు.

Image

యథావిధిగా ఆర్టీసీ సర్వీసులు 

సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయో అధికారులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి విద్యుత్ సరఫరా, రహదారుల పునరుద్ధరణ తక్షణం జరగాలని స్పష్టం చేశారు. బుధవారం రాత్రి కల్లా విద్యుత్ సరఫరా చేయాలని, గురువారం నాటికి రహదారుల గుంతలు మరమ్మతు పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏపీఎస్ ఆర్టీసీ సర్వీసులు యథావిధి కొనసాగించాలని సూచించారు. ఈ విషయాల్లో అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Image

మరమ్మతులకు గురైన ఫీడర్లను పునరుద్ధరిస్తున్నామని, కూలిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు వివరణ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడా నీరు నిలిచిపోకుండా డ్రైనేజీలను పటిష్ట పరచాలన్నారు. పారిశుధ్య పనులు ముమ్మరం చేయాలని చెప్పారు. జలాశయాల సమర్ధ నీటి నిర్వహణకు జిల్లా కలెక్టర్లు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పునరావాస కేంద్రాల్లోని కుటుంబాలకు గురువారం నాటికి బియ్యం, నిత్యావసరాల పంపిణీ జరగాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా తాగు నీటి సరఫరాకు ఇబ్బంది రాకూడదని, తాగునీరు కలుషితం అయితే సహించేది లేదని, డయేరియా కేసులు నమోదు కాకుండా రూరల్ వాటర్ సప్లయ్ అధికారులు బాధ్యత వహించాలన్నారు.

Image

ప్రకాశం జిల్లాలో మెరుగైన చర్యలు చేపట్టాలి

ఒంగోలు పట్టణంలో పలు కాలనీలు నీట మునగడంపై ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబుపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ ఇటువంటి పరిస్థితి తలెత్తలేదని, భవిష్యత్‌లో పాలనా వైఫల్యం కనిపించకూడదని ముఖ్యమంత్రి చెప్పారు. తుపాన్ రక్షణ చర్యలపై పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. ప్రతీ జిల్లాలోనూ తుపాన్ల సమయంలో తలెత్తే పరిస్థితులను అధిగమించేలా ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.

Image

రోడ్లు, పునరావాస కేంద్రాలు, విద్యుత్-తాగునీటి సరఫరా వంటి విషయాల్లో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రజాభిప్రాయం సేకరించి, లోపాలను సరిచేసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. మొంథా తుఫాన్ కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందారని అధికారులు వెల్లడించగా, మృతుల కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తుపాన్ తీరం దాటడంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. తుఫాన్ తీవ్ర స్థాయిలో లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారని, ప్రభుత్వం తీసుకున్న రక్షణ చర్యలపై ప్రజల నుంచి సానుకూల స్పందన, సంతృప్తి వ్యక్తమవుతోందని వెల్లడించారు.

Image

మొత్తం 1.16 లక్షల మందికి పునరావాసం

రాష్ట్రంలో 1,209 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడంతో 1.16 లక్షల మందికి మొంథా తుపాను సమయంలో ఆశ్రయం లభించింది. మొత్తం 249 మండలాలు, 1,434 గ్రామాలు, 48 మున్సిపాలిటీల్లో 18 లక్షల మందిపై తుపాన్ ప్రభావం చూపింది. రాష్ట్రంలో 380 కి.మీ. పొడవున పంచాయతీరాజ్ రహదారులు, 14 బ్రిడ్జిలు, కల్వర్టులు దెబ్బతినగా రూ.4.86 కోట్ల నష్టం వాటిల్లింది. 2,294 కి.మీ. పొడవున ఆర్ అండ్ బీ రహదారులు దెబ్బతిని రూ.1,424 కోట్ల నష్టం సంభవించింది.

Image

రూరల్ వాటర్ సప్లయ్‌కు సంబంధించి రూ.36 కోట్లు, ఇరిగేషన్‌ పనుల్లో రూ.16.45 కోట్ల వరకు నష్టం జరిగింది. సురక్షిత ప్రాంతాలకు 3,175 మంది గర్భిణీలను తరలించారు. 2,130 మెడికల్ క్యాంపుల నిర్వహించారు. 297 రహదారులపై వరద నీరు పొంగి ప్రవహిస్తుండగా, వాటిని దారి మళ్లించేలా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 380 చెట్లు రహదారులపై విరిగిపడగా, అన్నింటినీ తొలిగించినట్టు ప్రభుత్వం చెబుతోంది.

Image

Frequently Asked Questions

మొంథా తుపాన్ వల్ల ఎంత విస్తీర్ణంలో పంట నష్టం జరిగింది?

మొత్తం 87 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగింది. ఇందులో 59 వేల హెక్టార్లకుపైగా వరి, ప్రత్తి, మొక్కజొన్న, మినుము పంటలు నీట మునిగాయి.

తుపాన్ బాధితులకు ప్రభుత్వం ఎలాంటి సహాయం అందిస్తోంది?

పునరావాస కేంద్రాల్లోని కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

రవాణా మరియు విద్యుత్ సరఫరాకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

విద్యుత్ సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని, గురువారం నాటికి రహదారుల మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్టీసీ సర్వీసులు యథావిధిగా కొనసాగుతాయి.

తాగునీటి సరఫరా గురించి ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలు ఏమిటి?

రాష్ట్రంలో తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని, నీరు కలుషితం కాకుండా డయేరియా కేసులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Blast Case Viral Video: ఢిల్లీలో పేలుడుకు ముందు ఉమర్ సంచలన వీడియో విడుదల, ఆత్మాహుతి దాడిపై కీలక వ్యాఖ్యలు
ఢిల్లీలో పేలుడుకు ముందు ఉమర్ సంచలన వీడియో విడుదల, ఆత్మాహుతి దాడిపై కీలక వ్యాఖ్యలు
Telangana Roads: తెలంగాణలో 4 నేషనల్ హైవేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. టెండర్లు పిలిచిన NHAI
తెలంగాణలో 4 నేషనల్ హైవేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. టెండర్లు పిలిచిన NHAI
Saudi bus crash: అహ్మదాబాద్ తరహాలోనే సౌదీ బస్సు ప్రమాదంలోనూ ఒక్కరే బయటపడ్డారు - ఈ అద్భుతం ఎలా జరిగిందంటే ?
అహ్మదాబాద్ తరహాలోనే సౌదీ బస్సు ప్రమాదంలోనూ ఒక్కరే బయటపడ్డారు - ఈ అద్భుతం ఎలా జరిగిందంటే ?
Encounter In AP: అల్లూరి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. మోస్ట్ వాంటెడ్ హిడ్మా సహా ఆరుగురు మావోయిస్టులు మృతి!
భారీ ఎన్‌కౌంటర్.. మోస్ట్ వాంటెడ్ హిడ్మా సహా ఆరుగురు మావోయిస్టులు మృతి!
Advertisement

వీడియోలు

KL Rahul about IPL Captaincy | కెప్టెన్సీపై కేఎల్ రాహుల్  సంచలన కామెంట్స్
CSK Releasing Matheesha Pathirana | పతిరనా కోసం KKR తో CSK డీల్ ?
Kumar Sangakkara as RR Head Coach | రాజస్థాన్‌ రాయల్స్‌ కోచ్‌గా సంగక్కర
South Africa Captain Temba Bavuma Record | తెంబా బవుమా సరికొత్త రికార్డ్ !
Varanasi Movie Chhinnamasta Devi Story | వారణాసి ట్రైలర్ లో చూపించిన చినమస్తాదేవి కథ తెలుసా.? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Blast Case Viral Video: ఢిల్లీలో పేలుడుకు ముందు ఉమర్ సంచలన వీడియో విడుదల, ఆత్మాహుతి దాడిపై కీలక వ్యాఖ్యలు
ఢిల్లీలో పేలుడుకు ముందు ఉమర్ సంచలన వీడియో విడుదల, ఆత్మాహుతి దాడిపై కీలక వ్యాఖ్యలు
Telangana Roads: తెలంగాణలో 4 నేషనల్ హైవేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. టెండర్లు పిలిచిన NHAI
తెలంగాణలో 4 నేషనల్ హైవేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. టెండర్లు పిలిచిన NHAI
Saudi bus crash: అహ్మదాబాద్ తరహాలోనే సౌదీ బస్సు ప్రమాదంలోనూ ఒక్కరే బయటపడ్డారు - ఈ అద్భుతం ఎలా జరిగిందంటే ?
అహ్మదాబాద్ తరహాలోనే సౌదీ బస్సు ప్రమాదంలోనూ ఒక్కరే బయటపడ్డారు - ఈ అద్భుతం ఎలా జరిగిందంటే ?
Encounter In AP: అల్లూరి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. మోస్ట్ వాంటెడ్ హిడ్మా సహా ఆరుగురు మావోయిస్టులు మృతి!
భారీ ఎన్‌కౌంటర్.. మోస్ట్ వాంటెడ్ హిడ్మా సహా ఆరుగురు మావోయిస్టులు మృతి!
Bigg Boss Telugu Day 72 Promo : బిగ్​బాస్ ఫ్యామిలీ వీక్ మొదలైపోయింది.. తనూజ కూతురు, చెల్లి వచ్చేశారుగా
బిగ్​బాస్ ఫ్యామిలీ వీక్ మొదలైపోయింది.. తనూజ కూతురు, చెల్లి వచ్చేశారుగా
Annadata sukhibhava: బుధవారమే రైతుల ఖాతాల్లోకి ఏడు వేలు - కమలాపురంలో విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు
బుధవారమే రైతుల ఖాతాల్లోకి ఏడు వేలు - కమలాపురంలో విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు
24 hours before Death: మరణానికి 24 గంటల ముందు కనిపించే 3 సంకేతాలు! ఇవి శ్రీకృష్ణుడు, శివుడు చెప్పినవి కాదు?
మరణానికి 24 గంటల ముందు కనిపించే 3 సంకేతాలు! ఇవి శ్రీకృష్ణుడు, శివుడు చెప్పినవి కాదు?
India vs Dubai : భారత్ లేదా దుబాయ్.. ప్రాపర్టీ ఎక్కడ కొంటే మంచిది? లాభ, నష్టాలు ఇవే
భారత్ లేదా దుబాయ్.. ప్రాపర్టీ ఎక్కడ కొంటే మంచిది? లాభ, నష్టాలు ఇవే
Embed widget