అన్వేషించండి

What is Cyclone: తుపానులు సముద్రంలోనే ఎందుకు వస్తాయి? ఈ విషయాలు మీకు తెలుసా..

తుఫాను (Cyclone) అంటే ఒక తీవ్రమైన వాతావరణ వ్యవస్థగా చెప్పవచ్చు. ఇది వేగంగా తిరిగే గాలులు, భారీ వర్షపాతంతో కూడిన సుడిగాలి మిళితమై ఉంటుంది. దీన్నే ఉష్ణమండల తుఫాను (Tropical Cyclone) అని పిలుస్తారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో 'మొంధా' తుపాను గూర్చే చర్చ జరుగుతోంది. ప్రభుత్వ యంత్రాంగం ఈ తుపానును ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన అంశాలపై దృష్టి సారించింది. ప్రజలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే ఉంటున్నారు. పంటలు మునిగిపోతున్నాయి. చెట్లు విరిగిపడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి. పశుపక్ష్యాదులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇక మీడియా అంతా తుపాను వార్తలే. ఇంతటి విలయాన్ని సృష్టిస్తున్న తుపానుకు పుట్టిల్లు ఏంటో తెలుసా?

తుపానులు పుట్టేది సముద్రంలోనే. సముద్రంలో పుట్టే తుపాను భూమి మీదకు వస్తే పైన చెప్పిన తీరులో విలయాన్ని సృష్టిస్తుంది. అయితే, ఈ తుపానులు సముద్రంలో ఎందుకు ఏర్పడతాయో మీకు తెలుసా? తెలియకపోతే ఈ కథనం పూర్తిగా చదవండి. తుపానులు సముద్రంలో ఎందుకు పుడతాయన్న విషయాలు చక్కగా అర్థమవుతాయి.

అసలు తుపాను అంటే ఏంటి?

తుఫాను (Cyclone) అంటే ఒక తీవ్రమైన వాతావరణ వ్యవస్థగా చెప్పవచ్చు. ఇది వేగంగా తిరిగే గాలులు, భారీ వర్షపాతంతో కూడిన సుడిగాలి మిళితమై ఉంటుంది. దీన్నే ఉష్ణమండల తుఫాను (Tropical Cyclone) అని పిలుస్తారు, ఎందుకంటే ఇది వెచ్చని ఉష్ణమండల సముద్రాల మీదే ఏర్పడుతుంది. మనకు తెలిసిన తుపానులు అంటే ఉష్ణమండల తుఫానులు (Tropical Cyclones) సముద్రాలపైనే ఏర్పడతాయి. ఎందుకంటే తుపానులు పురుడు పోసుకోవడానికి, ఆ తర్వాత అది బలంగా మారడానికి అవసరమైన శక్తిని సముద్రం మాత్రమే అందిస్తుంది.

తుఫాను ఏర్పడటానికి ప్రధాన కారణాలు, పరిస్థితులు ఇవే

1. సముద్రపు వేడి నీరు ఇంధనంగా

తుఫానులకు వేడి, తేమనే ప్రధాన ఇంధనంగా చెప్పవచ్చు. ఉష్ణమండల తుఫానులు ఏర్పడటానికి సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత దాదాపు 26.5 డిగ్రీల సెంటిగ్రేడ్ లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ఈ వెచ్చటి నీరు సముద్రపు ఉపరితలం నుండి కనీసం 50 మీటర్ల లోతు వరకు ఉండాలి. ఇలా వేడిగా ఉన్న సముద్రం నుండి నీటి ఆవిరి (తేమ) పైకి లేచి వాతావరణంలోకి అధిక మొత్తంలో చేరుతుంది. ఇలా తుపాను ఏర్పడటానికి సముద్రపు వేడి నీరు ఇంధనంగా మారుతుంది.

2. నీటి ఆవిరి సంక్షేపణం (శక్తి విడుదల)

సముద్రం నుండి పైకి లేచిన వేడి, తేమతో కూడిన గాలి పైకి వెళ్లే కొద్దీ చల్లబడి, అందులోని నీటి ఆవిరి మేఘాలుగా రూపాంతరం చెందుతుంది. ఈ సంక్షేపణ ప్రక్రియలో ఆ నీటి ఆవిరి మేఘాల్లో దాగి ఉన్న ఉష్ణం (Latent Heat) విడుదల అవుతుంది. ఈ ఉష్ణమే తుఫాను వ్యవస్థ యొక్క కేంద్రాన్ని (Core) వేడి చేస్తుంది. ఆ కేంద్రం వేడెక్కడం వల్ల చుట్టూ ఉన్న గాలి మరింత వేగంగా పైకి లేస్తుంది, దాని స్థానంలోకి మరింత వేడి, తేమ గాలిని ఆకర్షిస్తుంది. ఇది ఒక "పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ లూప్" లాగా పనిచేసి తుఫానును మరింత బలంగా మారుస్తుంది. ఇలా నీటి ఆవిరి సంక్షేపణ ప్రక్రియ తుపాను ఏర్పడటానికి మరో కారణంగా చెప్పవచ్చు.

3. అల్ప పీడనం - గాలి భ్రమణం

వేడి గాలి పైకి లేచినప్పుడు, సముద్ర ఉపరితలంపై అల్ప పీడన ప్రాంతం (Low-Pressure Area) ఏర్పడుతుంది. చుట్టూ ఉన్న అధిక పీడనం గాలి ఆ అల్ప పీడన ప్రాంతం వైపు వేగంగా దూసుకువస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరగడం (Coriolis Effect) వల్ల ఈ లోపలికి వచ్చే గాలులు వలయాకారంలో (Circular motion) తిరగడం ప్రారంభిస్తాయి. ఉత్తరార్ధ గోళంలో అపసవ్య దిశలో (Anticlockwise), దక్షిణార్ధ గోళంలో సవ్య దిశలో (Clockwise) తిరుగుతాయి. ఈ భ్రమణమే తుఫాను యొక్క ముఖ్య లక్షణంగా చెప్పవచ్చు.

4. తక్కువ గాలి కోత (Wind Shear)

తుఫాను స్థిరంగా వృద్ధి చెందడానికి, వాతావరణంలో వివిధ ఎత్తులలో గాలి వేగం, దాని పయనం దిశలో పెద్దగా తేడాలు ఉండకూడదు. దీనినే తక్కువ లంబ గాలి కోత (Low Vertical Wind Shear) అంటారు. సముద్రాలపై ఈ పరిస్థితి తరచుగా అనుకూలంగా ఉంటుంది. దీని వల్ల తుపానుకు అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది.

తీరం చేరే వరకే తుపాను ప్రభావం

అయితే, పైన చెప్పిన ఈ నాలుగు పరిస్థితులు ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ (Positive Feedback), తుపాను అనే వ్యవస్థకు నిరంతర శక్తిని అందిస్తుంటాయి. ఈ కారణంగా అల్ప పీడనాన్ని వాయుగుండంగా, ఆపై తుఫానుగా పై నాలుగు పరిస్థితులు మారుస్తాయి. ఈ నాలుగు పరిస్థితుల్లో ఏ ఒక్కటి లేకపోయినా, తుపాను సముద్రంలోనే బలహీనపడి విచ్ఛిన్నమవుతుంది. అయితే, ఇలా ఏర్పడిన తుపాను తీరాన్ని దాటి భూమిపైకి వచ్చాక దానికి శక్తినిచ్చే వేడి, తేమ గాలి సరఫరా ఆగిపోతుంది. అప్పుడు తుపాను బలహీనపడుతుంది. అయితే, సముద్ర ప్రాంతం నుండే ఇవి సృష్టించిన మేఘాలు వర్షిస్తాయి. భూమి మీదకు వచ్చాక తుపాను కొన్ని గంటల్లో బలహీనపడిపోతుంది. అయితే, ఆ ప్రభావంతో భూమి మీదకు వచ్చిన మేఘాలు వర్షిస్తాయి. దీని వల్ల భారీ వర్షాలు తీర ప్రాంతంలో కురుస్తాయి. అంతే కాకుండా, ఆ తుపాను ప్రభావం ఎంత దూరం అంటే అంత దూరం వర్షాల ప్రభావం ఉంటుంది.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఒక్కఛాన్స్ పేరుతో ఏపీ నష్టపోయింది, బిహార్‌లో ఆ పరిస్థితి రావద్దు: నారా లోకేష్
ఒక్కఛాన్స్ పేరుతో ఏపీ నష్టపోయింది, బిహార్‌లో ఆ పరిస్థితి రావద్దు: నారా లోకేష్
Ram Gopal Varma : చిరంజీవి గారు సారీ - మెగాస్టార్‌కు RGV అపాలజీ... అసలు రీజన్ అదేనా?
చిరంజీవి గారు సారీ - మెగాస్టార్‌కు RGV అపాలజీ... అసలు రీజన్ అదేనా?
Hyderabad Crime News: మహిళ ప్రాణం తీసిన వివాహేతర సంబంధం.. దారుణహత్య కేసులో ఊహించని ట్విస్ట్
మహిళ ప్రాణం తీసిన వివాహేతర సంబంధం.. దారుణహత్య కేసులో ఊహించని ట్విస్ట్
AR Rahman Concert : రెహమాన్ కాన్సెర్ట్‌లో 'పెద్ది' టీం సందడి - 'చికిరి చికిరి' జోష్ వేరే లెవల్
రెహమాన్ కాన్సెర్ట్‌లో 'పెద్ది' టీం సందడి - 'చికిరి చికిరి' జోష్ వేరే లెవల్
Advertisement

వీడియోలు

Dhruv Jurel Century for India A | సెంచరీలతో చెలరేగిన ధ్రువ్ జురెల్
Abhishek Sharma World Record in T20 | అభిషేక్ శర్మ వరల్డ్ రికార్డు !
Artificial Rain Failure in Delhi | Cloud Seeding | క్లౌడ్ సీడింగ్ ఫెయిల్యూర్ కి కారణాలు ఇవే ! | ABP Desam
సిరీస్ భారత్‌దే.. వన్డేల పగ టీ20లతో తీర్చుకున్న టీమిండియా
Sanju Samson in IPL 2026 | క్లాసెన్‌ ను విడుదుల చేయనున్న SRH ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఒక్కఛాన్స్ పేరుతో ఏపీ నష్టపోయింది, బిహార్‌లో ఆ పరిస్థితి రావద్దు: నారా లోకేష్
ఒక్కఛాన్స్ పేరుతో ఏపీ నష్టపోయింది, బిహార్‌లో ఆ పరిస్థితి రావద్దు: నారా లోకేష్
Ram Gopal Varma : చిరంజీవి గారు సారీ - మెగాస్టార్‌కు RGV అపాలజీ... అసలు రీజన్ అదేనా?
చిరంజీవి గారు సారీ - మెగాస్టార్‌కు RGV అపాలజీ... అసలు రీజన్ అదేనా?
Hyderabad Crime News: మహిళ ప్రాణం తీసిన వివాహేతర సంబంధం.. దారుణహత్య కేసులో ఊహించని ట్విస్ట్
మహిళ ప్రాణం తీసిన వివాహేతర సంబంధం.. దారుణహత్య కేసులో ఊహించని ట్విస్ట్
AR Rahman Concert : రెహమాన్ కాన్సెర్ట్‌లో 'పెద్ది' టీం సందడి - 'చికిరి చికిరి' జోష్ వేరే లెవల్
రెహమాన్ కాన్సెర్ట్‌లో 'పెద్ది' టీం సందడి - 'చికిరి చికిరి' జోష్ వేరే లెవల్
Cheapest Cars With Sunroof:  ₹10 లక్షల్లో సన్‌రూఫ్‌ కలిగిన టాప్‌ 10 చవకైన కార్లు - టాటా, హ్యుందాయ్‌ తగ్గేదేలే!
₹10 లక్షల్లో సన్‌రూఫ్‌ ఉన్న చవకైన కారు ఏది?, ఫ్యామిలీ కోసం పెద్ద లిస్ట్‌
Rohit Sharma and Kohli Career: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్థానాలను భర్తీ చేయవచ్చు.. ఆస్ట్రేలియా దిగ్గజం సంచలనం
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్థానాలను భర్తీ చేయవచ్చు.. ఆస్ట్రేలియా దిగ్గజం సంచలనం
Amalapuram Murder case: బూతులు తిట్టాడని అనుచరుడిని చంపిన రౌడీషీటర్, 8 మంది అరెస్ట్! అమలాపురంలో సంచలనం
బూతులు తిట్టాడని అనుచరుడిని చంపిన రౌడీషీటర్, 8 మంది అరెస్ట్! అమలాపురంలో సంచలనం
Bigg Boss 9 Telugu: 'శివ' రీ రిలీజ్ ప్రమోషన్స్ to రామూ రాథోడ్ ఎలిమినేషన్ వరకు... శనివారం బిగ్ బాస్9 ఎపిసోడ్ విశేషాలు
'శివ' రీ రిలీజ్ ప్రమోషన్స్ to రామూ రాథోడ్ ఎలిమినేషన్ వరకు... శనివారం బిగ్ బాస్9 ఎపిసోడ్ విశేషాలు
Embed widget