అన్వేషించండి

TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్

మొయినాబాద్‌లోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫాం హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్

మొయినాబాద్: హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్‌ అజీజ్‌నగర్‌లో ఉన్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. డ్రగ్స్ టెస్టులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ (ఏలూరు)తో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా మొత్తం ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. నమిత్‌, రితేష్ రెడ్డి, కౌశిక్‌ రవి, అర్జున్‌రెడ్డిలకు డ్రగ్స్ టెస్టులో పాజిటివ్‌గా తేలింది. డ్రగ్స్ టెస్టులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌కు నెగటివ్ రాగా, బ్లడ్ టెస్టు చేయగా పాజిటివ్ వచ్చింది. దాంతో డ్రగ్ టెస్టులో మొత్తం ఆరుగురికి పాజిటివ్ వచ్చిందని ప్రకటించారు.

ఈగల్ (EAGLE) ఫోర్స్ నిర్వహించిన మెరుపు దాడుల్లో నిందితులు తుపాకీతో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి పోలీసులను భయపెట్టే ప్రయత్నం చేశారని తెలిపారు. ఫాం హౌస్‌లో డ్రగ్స్ పార్టీపై దాడులకు సంబంధించి ఈగల్ ఫోర్స్ ఎస్పీ ఆర్. గిరిధర్ మీడియాకు వివరాలను వెల్లడించారు.


TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్

11 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..

"డ్రగ్స్ పార్టీ జరగుతుందని సమాచారం మేరకు మేం రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌పై దాడి చేశాము. లోపలికి ప్రవేశించిన సమయంలో మా అధికారులకు కొన్ని శబ్దాలు వినిపించాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అక్కడికి చేరుకోగా, ఒక వ్యక్తి పిస్టల్ పట్టుకుని కనిపించాడు. మరొకరి వద్ద ఖాళీ తూటాలు ఉన్నాయి. వెంటనే అక్కడ ఉన్న 11 మందిని అదుపులోకి తీసుకున్నాం. వారికి నిర్వహించిన ప్రాథమిక డ్రగ్ టెస్టులో ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. ఆసుపత్రిలో నిర్వహించిన రక్త నమూనాల పరీక్షల్లో మరో వ్యక్తి (టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్)కి కూడా పాజిటివ్ రావడంతో, మొత్తం ఆరుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది" అని ఈగల్ ఫోర్స్ ఎస్సీ గిరిధర్ తెలిపారు.

ముఖ్య నేతలు అరెస్ట్ 
పోలీసులు అదుపులోకి తీసుకున్న 11 మందిలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తొలుత పుట్టా మహేష్ యాదవ్‌కు నెగిటివ్ వచ్చినట్లు ప్రచారం జరిగినప్పటికీ, రక్త నమూనాల (Blood Sample) నివేదికలో ఆయనకు డ్రగ్స్ పాజిటివ్ అని తేలిందని ఎస్పీ గిరిధర్ స్పష్టం చేశారు. 


TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్

పోలీసులపై కాల్పులు జరిపారు.. చేవెళ్ల డిసిపి యోగేష్ గౌతమ్
మొయినాబాద్: అనుమతి లేకుండా ఒక ఫామ్‌హౌస్‌లో పార్టీ జరుగుతుందనే సమాచారంతో పోలీసులు శనివారం రాత్రి 9:30 గంటలకు రోహిత్ రెడ్డి ఫాం హౌస్‌కు వెళ్లి ఆకస్మిక దాడలు నిర్వహించారని చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ తెలిపారు. ‘పోలీసులు అక్కడికి చేరుకోగానే, ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ శర్మ గన్‌తో ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. రోహిత్ రెడ్డి తమ్ముడు రితేష్ రెడ్డికి చెందిన ఆ తుపాకీకి లైసెన్స్ ఉంది.  అయితే, కాల్పులు జరిపింది మాత్రం నమిత్ శర్మ. 

పార్టీలో 2 గ్రాముల తెల్లటి పొడి (డ్రగ్స్) కూడా పోలీసులకు లభ్యమైంది. అక్కడ ఒక మహిళ సహా మొత్తం 10 మంది ఉన్నారు. వారిలో ప్రజా ప్రతినిధులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు. ఆ 10 మందిలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, రితేష్ రెడ్డి, శ్రవణ్ కుమార్,  నమిత్ మిశ్రా, ఎం. రమేష్, విజయ్ కృష్ణ, రవి, అర్జున్ రెడ్డి ఉన్నారు. వీరిలో ఐదుగురు రోహిత్ రెడ్డి, నమిత్ మిశ్రా, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి,  అర్జున్ రెడ్డిలకు డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చింది. తదుపరి విచారణ నిమిత్తం వారందరినీ అదనపు శాంపిల్ పరీక్షలకు పంపాం. పూర్తి నివేదికలు వచ్చాక చట్టపరమైన చర్యలు ఉంటాయని’ చేవెళ్ల డిసిపి యోగేష్ గౌతమ్ పేర్కొన్నారు.

కేసులో ముఖ్యాంశాలు..

మొత్తం అరెస్టులు: 11 మంది కస్టడీలో ఉండగా, ఆరుగురికి డ్రగ్ పాజిటివ్.

కాల్పుల కలకలం: పోలీసులను అడ్డుకునేందుకు ఒక వ్యక్తి పిస్టల్‌తో గాలిలోకి కాల్పులు జరిపారు.

రికవరీ: ఫామ్‌హౌస్ నుండి పిస్టల్, ఖాళీ తూటాలు, డ్రగ్స్ స్వాధీనం.

నిందితులను వైద్య పరీక్షల అనంతరం స్థానిక పోలీసులకు అప్పగించారు. వారిని నేడు కోర్టులో హాజరుపరచనున్నారు.ఈ దాడిలో పట్టుబడిన వారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలకు చెందిన కీలక రాజకీయ నేతలు కావడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Jana Sena Leader Murder Attempt: గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget