టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గత ఏడాదిన్నర కాలంగా తాను ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి, పరిణామాలపై స్పందిస్తూ.. ఇక తన వల్ల కాలేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జట్టులో నిలకడలేమి చోటు చేసుకోవడం, పదే పదే అవకాశాలు రాకపోవడంపై ఆయన పరోక్షంగా తన అసంతృప్తిని వెళ్లగక్కినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సంజు శాంసన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.