అన్వేషించండి
Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
JC Prabhakar Reddy: తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. ఫయాజ్ భాషా అనే వైసీపీ నేత ఇంటిపై దాడి జరిగింది.

తాడిపత్రిలో ఉద్రిక్తత
Source : x
Tadipatri News: తాడిపత్రి నగరంలో ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీకి చెందిన ఫయాజ్ భాషా అనే వ్యక్తి ఇటీవల కొత్త ఇల్లు నిర్మించారు. ఆ ఇల్లు అక్రమ నిర్మాణం అన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కూల్చివేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో మున్సిపల్ చైర్మన్ గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ ఇల్లు పరిశీలించడానికి వెళ్లారు. టీడీపీ కార్యకర్తలుకూడా పెద్ద ఎత్తున వెళ్లారు. ఫయాజ్ భాషా ఇంటి వద్ద వైసీపీ కార్యకర్తలు ఉండటంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అక్కడ ఉన్న పలు వాహనాలు ధ్వంసమయినట్లుగా తెలుస్తోంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్




















