Meena Rashi Phalalu 2025 : మీన రాశి ఫలితాలు - అవమానాలు, అపనిందలు, అడుగుకో పరీక్ష.. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగం!
Ugadi Rasi Phalalu 2025: శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీన రాశి వారికి ఏల్నాటి శని ఉంది. ఈ ఏడాది మొత్తం ఎలా ఉందో వార్షిక ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి..

Sri Viswasu Nama Samvatsara Panchamgam 2025- 2026: శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీన రాశివారికి ఏల్నాటి శని ప్రభావం ఉంటుంది. పన్నెండో స్థానంలో రాహువు సంచారం వల్ల చికాకుకు తప్పవు. ఎంత ప్రశాంతంగా ఉన్నా, వినయ విధేయతలు ప్రదర్శించినా నెగ్గుకురావడం కష్టమే. ఎంత కష్టపడినా ఆశించిన ఫలితం పొందలేరు. నిరాశ, నిస్పృహతో ఉంటారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడతారు. అపనిందలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. అవమానాలు జరుగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు, అప్పుల బాధలు తప్పవు. విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు. బయటకు గంభీరంగా కనిపించినా లోలోపల భయాందోళన వెంటాడుతుంది.
ఉద్యోగులకు
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీన రాశి ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలుంటాయి. అంతా సాఫీగా ఉన్నట్టే ఉంటుంది కానీ రాహువు సంచారం కారణంగా ఇబ్బందులు తప్పవు. ప్రశాంతత ఉండదు. ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన ప్రమోషన్ ఆగిపోతుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలించవు. నిరుద్యోగులకు ఈ ఏడాది కూడా నిరాశ తప్పదు.
రాజకీయ నాయకులకు
మీన రాశి రాజకీయ నాయకులకు కొంతవరకూ మంచి ఫలితాలున్నాయి. ప్రజల్లో మీరు పేరు ప్రఖ్యాతులు బావుంటాయి. అధిష్టాన వర్గానికి మీపై మంచి అభిప్రాయమే ఉంటుంది. అయితే పార్టీలో మీరు నమ్మినవారే మీకు రావాల్సిన పదవికి అడ్డుపడతారు. ఎన్నికల్లో పోటీచేస్తే స్వల్ప మెజార్టీతో విజయం సాధించే అవకాశం ఉంది.
. (ఉగాది పంచాంగం 2025 ధనస్సు రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి )
వ్యవసాయదారులకు
మీన రాశి వ్యవసాయదారులకు పంటదిగుబడి బావుంటుంది. ఆశించిన స్థాయిలో లాభాలు లేకున్నా నష్టాలు అయితే రావు. చేపలు, రొయ్యలు చెరువుల వారికి లాభం వస్తుంది.
వ్యాపారులకు
మీన రాశికి చెందిన హోల్సేల్ అండ్ రీటైల్ వ్యాపారులకు లాభాలొస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు అస్సలు కలసిరావు. నిర్మాణ రంగంలో ఉండేవారికి బావుంటుంది.
కళాకారులకు
ఈ ఏడాది టీవీ, సినిమా కళాకారులకు అంత అనుకూల ఫలితాలు లేవు. కష్టానికి తగిన ఫలితం ఉండదు...ప్రతిభకు తగిన అవకాశం రాదు. నూతన అవకాశాలు అంతంతమాత్రంగానే ఉంటాయి. అయినప్పటికీ అవార్డుల వరకూ వచ్చేసరికి ముందుండే అవకాశం ఉంది.
విద్యార్థులకు
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీన రాశి విద్యార్థులకు అంత అనుకూల ఫలితాలు లేవు. శని, రాహువు ప్రభావంతో చదువుపై శ్రద్ధ ఉండదు. ఇతర వ్యవహారాలపై ఆసక్తి పెరుగుతుంది. ఎంట్రన్స్ పరీక్షలలో మంచి మార్కులు పొందలేరు.
(ఉగాది పంచాంగం 2025 మకర రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
స్త్రీలకు
మీన రాశి స్త్రీలకు ఏల్నాటి శని, ద్వాదశంలో రాహువు ప్రభావంతో మీకు గౌరవం ఉండదు. వైవాహిక జీవితంలో చికాకులు తప్పవు. కుటుంబంలో సంతోషం ఉండదు. మాతృ, పితృవంశ సూతకములు ఉంటాయి. విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు. ఉద్యోగులుకు మనఃశ్సాంతి ఉండదు.
వివాహంకాని వారికి వివాహం జరుగుతుంది
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీన రాశి వారికి జీవితం పరీక్షా కాలమా అన్నట్టుంటుంది. మీలో నేర్పు మీకు ఊరట కలిగిస్తుంది.
ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శుభాకాంక్షలు
గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.
( కన్యారాశి ఉగాది 2025 ఫలితాలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

