Ugadi Rasi Phalalu 2025: ధనస్సు రాశి ఉగాది పంచాంగం 2025 -26 ..అడుగేస్తే లాభం , పట్టిందల్లా బంగారం, అన్నింటా జయం!
Ugadi Rasi Phalalu 2025: శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ధనస్సు రాశి వారి వార్షిక ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి..

ఉద్యోగులకు
ధనస్సు రాశి ఉద్యోగులకు ఈ ఏడాది అనుకూల ఫలితాలున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ తో కూడిన బదిలీలు ఉంటాయి. పై అధికారుల మన్ననలు పొందుతారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారికి జీతాలు పెరుగుతాయి. గృహయోగం, వాహనయోగం ఉంటుంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు యాజమాన్యం మెప్పు పొందుతారు. నిరుద్యోదులు మంచి ఉద్యోగం సాధిస్తారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు పర్మినెంట్ అవుతుంది.
( మేష రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
రాజకీయనాయకులకు
ఈ ఏడాది మీకు హోన్నతంగా ఉంటుంది. ప్రజల మన్ననలు పొందుతారు. పార్టీకోసం మీరు పడే కష్టానికి అధిష్టానం నుంచి గుర్తింపు లభిస్తుంది. మంచి పదవి లభిస్తుంది. డబ్బుమాత్రం భారీగా ఖర్చవుతుంది. ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం మీదే
కళాకారులకు
టీవీ, సినిమా రంగాల్లో ఉండేవారికి ఈ ఏడాది మంచి అవకాశాలు వస్తాయి. అవార్డులు, రివార్డులు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. గౌరవం దక్కుతుంది.
వ్యాపారులకు
ధనస్సు రాశి వ్యాపారులకు ఈ ఏడాది లాభదాయకంగా ఉంటుంది. ఫైనాన్స్ రంగంలో ఉండేవారికి వసూళ్లు బావుంటాయి. నిర్మాణ రంగంలో ఉండేవారికి లాభం. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి మిశ్రమ ఫలితాలుంటాయి.
(వృషభ రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
విద్యార్థులకు
గురుబలం బావుండడంతో ధనస్సు రాశివారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇతర వ్యవహారాలకు దూరంగా ఉండి చదువుపై శ్రద్ధ పెడతారు. మెడికల్ ఇంజనీరింగ్, లాసెట్, ఐసెట్, బి.ఇడి లాంటి ఎంట్రన్స్ పరీక్షలలో మంచి ర్యాంకులు సాధిస్తారు. కోరుకున్న కాలేజీల్లో సీట్లు పొందుతారు.
వ్యవసాయదారులకు
ఈ ఏడాది వ్యవసాయదారులకు రెండు పంటలు లాభాన్నిస్తాయి. కౌలుదార్లు, చేపల చెరువుల వారు లాభపడారు.
స్రీలకు
ధనస్సు రాశి స్త్రీలకు ఈ ఏడాది అద్భుతంగా ఉంటుంది. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. ఇంటా బయటా మీకు గుర్తింపు ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగం చేసేవారికి అధికారుల ప్రశంసలు అందుతాయి. వివాహం కాని స్త్రీలకు ఈ ఏడాది తప్పనిసరిగా పెళ్లి జరుగుతుంది.
(మిథున రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం 2025 -2026లో ధనస్సు రాశి వారికి యోగదాయకమైన సమయం..అయితే ఎనిమితో స్థానంలో గ్రహ సంచారం వల్ల జూన్ నుంచి చికాకులు ఎదురవుతాయి.
ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శుభాకాంక్షలు
గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.
( కన్యారాశి ఉగాది 2025 ఫలితాలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

