Telangana: సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
Mallareddy: సీఎం రేవంత్ తో హరీష్ రావు, మల్లారెడ్డి వేర్వేరుగా కలిశారు. ఇందులో రాజకీయం లేదని వారు స్పష్టం చేశారు.

Harish Rao and Malla Reddy met CM Revanth: రాజకీయాలు అంటే ఊహాతీతం. ఎప్పుడు ఎవర్ని ఎందుకు కలుస్తారో చెప్పలేం. అలాంటి సమావేశాలు శుక్రవారం చోటు చేసుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిని హరీష్ రావు కలిశారు. ఆయనతో పాటు పద్మారావు కూడా ఉన్నారు. వీరిద్దదరూ సీఎంను ఎందుకు కలిశారో తెలియదు కానీ.. పద్మారావు మాత్రం తన నియోజకవర్గ సమస్యపై కలిసేందుకు రేవంత్ చాంబర్ కు వెళ్లామన్నారు. పద్మారావు నియోజకవర్గం సికింద్రాబాద్‌లో కేసీఆర్ మంజూరు చేసిన హై స్కూల్, కాలేజీ పనులను వెంటనే ప్రారంభించాలని సీఎం దగ్గరకు వెళ్ళామమని పద్మారావు మీటింగ్ తరవాత మీడియా ప్రతినిధులుక చెప్పారు. అయితే తాము వెళ్లే సరికి సీఎం రూమ్ నిండా జనం ఉన్నారని.. తాము ఆయనతో ఏమీ మాట్లాడలేదన్నారు. తాము తీసుకెళ్లిన పేపర్లను వేం నరేందర్ రెడ్డి కి ఆ పేపర్ ఇచ్చి వచ్చేసామని పద్మారావు తెలిపారు.
పద్మారావు పిలిస్తేనే వెళ్లానన్న హరీష్ రావు
తాను రేవంత్ చాంబర్ కు ప్రత్యేకంగా తాను వెళ్లలేదని.. పద్మారావు రమ్మన్నాడని నేను వెళ్లానని అంతే అని హరీష్ రావు వివరణ ఇచ్చారు. అక్కడ ఎవరితోనూ మాట్లాడలదేన్నారు. అయితే ఇలాంటి కీలక సమయంలో సీఎంను విడిగా కలవడం వల్ల ఎలాంటి ప్రచారాలు జరుగుతాయో వీరిద్దరికీ తెలియనిదేం కాదని అనుకోవచ్చు. అందుకే అడగకుండానే మీడియా ప్రతినిధులు చిట్ చాట్ లో వివరణ ఇచ్చారు.
మెడికల్ కాలేజీలో సీట్ల పెంపు కోసం కలిశామన్న మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి
మరో వైపు మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా సీఎం రేవంత్ ను కలిసారు. ఇటీవలి కాలంలో రేవంత్ తో సంబంధాల కోసం వీరిద్దరూ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం కూడా జరిగింది. మల్లాెడ్డి కి చెందిన కాలేజీల ఆక్రమణలను కూడా అప్పట్లో జోరుగా కూల్చివేశారు. తర్వాత పరిస్థితులు నెమ్మదించాయి. తాము రాజకీయ పరమైన అంశాలతో కలవలేదని.. మెడికల్ కాలేజీ సీట్ల పెంపు గురించి కలిశామని మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి మీడియాకు చెప్పారు. మెడికల్ కాలేజీ సీట్ల పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర పరిమితంగా ఉంటుంది. అయినా సహకరించాలని కోరేందుకు కలిసినట్లు చెప్పారు.
అసెంబ్లీలో ప్రభుత్వంపై విరుచుకుపడిన బీఆర్ఎస్
అయితే అసెంబ్లీలో ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విరుచుకుపడుతున్నారు. బడ్జెట్ పై ప్రసంగంలో హరీష్ రావు.. .రేవంత్ ను తీవ్ర స్థాయిలో విమర్శించారు. సీఎంను ఎవరైనా కలవొచ్చు కానీ.. ప్రతీ భేటీలోనూ రాజకీయాలు వెదకలేమని కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేలు అన్న తర్వాత పనులు ఉంటాయని చేయించుకోవడానికి కొన్ని సార్లు కలవక తప్పదంటున్నారు. సీఎంను మల్లారెడ్డి, హరీష్ రావు కలవడంలో ఎలాంటి విశేషం ఉండదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

