అన్వేషించండి

Harish Rao on Fire: నాలుగున్నర లక్షలు కాదు కదా... నాలుగు ఇళ్లు కూడా కట్టలేదు. భట్టన్నా.. మధిరలో ఒక్క ఇళ్లైనా కట్టిన్రా..?

Harish Rao in Telangana Assembly | కాంగ్రెస్ పాలనతో అభివృద్ధి ఆగిపోయిందని, మీ నెగిటివ్ పాలసీలు, మీ నెగిటివ్ పాలిటిక్స్ మూలంగా ఆదాయం కుంటుపడిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.

Telangana Assembly Sessions | హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ లెక్కలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘కాంగ్రెస్ బడ్జెట్లు అవాస్తవిక అంచనాలు అని గతంలోనే చెప్పాను. కానీ వారు కాదు పొమ్మన్నరు. గత ఏడాది బడ్జెట్ 2 లక్షల 91 వేల 159 కోట్లు అని గొప్పగా చెప్పుకున్నారు. రివైజ్డ్ ఎస్టిమేషన్ లో 27 వేల కోట్లు తక్కువ చేసి చూపించారు. సీఎం రేవంత్ రెడ్డి అయితే 60 వేల నుంచి 70 వేల కోట్లు తక్కువగా వస్తాయని చెప్పారు. అంటే అంచనా అవాస్తవం అని తేలిపోయింది.

FIRST, THEY PROMISE REFORMS, THEN THEY REFORMED THEIR PROMISES 
పైన చెప్పిన కొటేషన్ ఎవరు చెప్పారో గానీ కాంగ్రెస్ కోసమే చెప్పారు. ఎన్నికలకు ముందు మార్పు పేరిట వాగ్దానాలు ఇచ్చారు. ఎన్నికలు అయ్యాక ఆ వాగ్దానాలనే ఏమార్చేసారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ లేని రుణాలకు సంబంధించి ఈరోజు వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేసింది లేదు.  వడ్డీ లేని రుణాల పరిమితిని గత ప్రభుత్వంలో మేం ఇచ్చిన 5లక్షలకు మించి పెంచలేదు. 5లక్షల వరకే వడ్డీ అందుతుందని ప్రభుత్వమే శాసనసభలో మేము అడిగిన ప్రశ్నకు సమాధానంగా స్పష్టంగా చెప్పింది. మళ్లీ మీరే తీసుకున్న మొత్తం రుణానికి వడ్డీ లేని రుణం అని ప్రచారం చేస్తున్నారు’ అని హరీష్ రావు ప్రశ్నించారు.


మహిళా సంఘాలు తీసుకున్న మొత్తం రుణానికి VLR వర్తిస్తుంది అనే ఉత్తర్వులు ఎక్కడైనా ఉంటే చూపాలని భట్టి విక్రమార్క గారిని కోరుతున్నాను. లేదా ఈ సభను తప్పుదోవ పట్టించినందుకు, మహిళల్ని మోసం చేసిందనందుకు క్షమాపణలు చెప్పాలని మా డిమాండ్. ఈ ఏడాది కాలంలో కూల్చిన ఇండ్లే తప్పా.. రాష్ట్రంలో కట్టిన ఇల్లు ఒక్కటన్నా ఉందా? మీ మధిరల ఒక్క ఇల్లన్న కట్టిన్రా, చూపిస్తరా భట్టిగారు. కాంగ్రెస్ చెప్పినట్లు నాలుగున్నర లక్షలు కాదు కదా, ఈ 16నెలల కాంగ్రెస్ పాలనలో 4 ఇండ్లన్న కట్టలేదు. మీరుండడం వల్ల రూపాయి ఎక్కువ వస్తదని ఆశ పడ్డరు. కానీ మీరు ఉన్నది తీసేసారు. ఎస్సీ, ఎస్టీలకు అదనంగా లక్ష రూపాయలు ఇస్తామన్నది ఏత్తేసారు. దళితులను, గిరిజనులను ఈ ప్రభుత్వం మోసం చేసింది.

 

జాబ్ లెస్ క్యాలెండర్.. అంతా అంకెల గారడీ 
జాబ్ క్యాలెండర్ కాస్తా, జాబ్ లెస్ క్యాలెండర్ అయ్యింది. జాబులేవి అని అడిగితే నిరుద్యోగుల వీపులు పగలగొట్టారు. జాబ్ క్యాలెండర్ అమలు చేయలేదు. యువతకు మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు. తుది దశలో ఉన్న ఆరు ప్రాజెక్టులను ఈ ఆర్థిక సంవత్సరం పూర్తిచేస్తమని గత బడ్జెట్ లో అన్నరు. ఒకవేళ పూర్తయితే 6 ప్రాజెక్టుల పేర్లు చెప్పండి. లేదా సభను తప్పుదోవ పట్టించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బడ్జెట్ అనేది రాష్ట్ర అభివృద్ధి ముఖ చిత్రం. కానీ రాష్ట్ర ప్రభుత్వానిది అంకెల గారడీ తప్ప, అమలు ఉండదా. ఇంత దారుణమా? మీ ప్రసంగాలు, మీ బడ్జెట్ లెక్కలు చూస్తున్న ప్రజలు ఏమనుకుంటరు అనే కనీస ఆలోచన కూడా లేదా?  అంకెలు చూస్తే ఆర్భాటం... పనులు చూస్తే డొల్లతనంలా ఉందని హరీష్ రావు ఎద్దేవా చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
AP Crime News: పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని కొడవళ్లతో నరికి దారుణహత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని కొడవళ్లతో నరికి దారుణహత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
Donald Trump: 120 దేశాల వలసదారులకు అమెరికా సాయం.. జాబితాలో కనిపించని భారత్, పలు దేశాల్లో గందరగోళం
120 దేశాల వలసదారులకు అమెరికా సాయం.. జాబితాలో కనిపించని భారత్, పలు దేశాల్లో గందరగోళం
Crazy Kalyanam : 'క్రేజీ కల్యాణం' చూసేందుకు రెడీయేనా! - క్రేజీ కాంబోతో వంద శాతం ఎంటర్టైన్మెంట్ కన్ఫర్మ్
'క్రేజీ కల్యాణం' చూసేందుకు రెడీయేనా! - క్రేజీ కాంబోతో వంద శాతం ఎంటర్టైన్మెంట్ కన్ఫర్మ్

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
AP Crime News: పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని కొడవళ్లతో నరికి దారుణహత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని కొడవళ్లతో నరికి దారుణహత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
Donald Trump: 120 దేశాల వలసదారులకు అమెరికా సాయం.. జాబితాలో కనిపించని భారత్, పలు దేశాల్లో గందరగోళం
120 దేశాల వలసదారులకు అమెరికా సాయం.. జాబితాలో కనిపించని భారత్, పలు దేశాల్లో గందరగోళం
Crazy Kalyanam : 'క్రేజీ కల్యాణం' చూసేందుకు రెడీయేనా! - క్రేజీ కాంబోతో వంద శాతం ఎంటర్టైన్మెంట్ కన్ఫర్మ్
'క్రేజీ కల్యాణం' చూసేందుకు రెడీయేనా! - క్రేజీ కాంబోతో వంద శాతం ఎంటర్టైన్మెంట్ కన్ఫర్మ్
Jana Nayagan OTT : 'జన నాయగన్' రిలీజ్‌కు ముందే ట్విస్ట్? - ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా!
'జన నాయగన్' రిలీజ్‌కు ముందే ట్విస్ట్? - ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా!
Ravindra Jadeja: రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్
రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Jana Nayakudu : విజయ్ 'జన నాయకుడు' ఎఫెక్ట్ - రెండేళ్ల తర్వాత టాప్ ట్రెండింగ్‌లో బాలయ్య మూవీ
విజయ్ 'జన నాయకుడు' ఎఫెక్ట్ - రెండేళ్ల తర్వాత టాప్ ట్రెండింగ్‌లో బాలయ్య మూవీ
Embed widget