Hyderabad Traffic Diversion: అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా హైదరాబాద్ లోని US consulate రోడ్ మూసివేత
US Consulate General Hyderabad | అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల దృష్ట్యా, హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న అమెరికా కాన్సులేట్ వద్ద వాహనాలపై ఆంక్షలు విధించారు.

హైదరాబాద్: అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా, ముందస్తు జాగ్రత్త చర్యగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న అమెరికా కాన్సులేట్ వద్ద భద్రతను భారీగా పెంచారు. ఇందులో భాగంగా కాన్సులేట్‌కు వెళ్లే ప్రధాన రహదారిని పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. కాన్సులేట్ పరిసరాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించడమే కాకుండా, ఆ మార్గంలో వెళ్లే వాహనాలపై ఆంక్షలు విధించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ రోడ్డు మూసివేత వల్ల గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, స్థానిక ప్రయాణికులు కొంత ఇబ్బందులకు గురవుతున్నారు.
హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ ముందు ఉన్న రహదారిని భద్రతా కారణాల దృష్ట్యా రెండు వైపులా మూసివేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యామ్నాయ మార్గాల వివరాలు వెల్లడించారు. తదుపరి ప్రకటన చేసే వరకు ఈ రోడ్డులో ఆంక్షలు కొనసాగుతాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
🚨 TRAFFIC ADVISORY – ROUTE DIVERSION 🚨
— Cyberabad Traffic Police (@CYBTRAFFIC) March 2, 2026
The road in front of the US Consulate General Hyderabad is blocked at both ends due to security reasons.
🚧 Suggested Alternate Routes:
➡️ From ICICI towards Gowlidoddi:
Take RIGHT at Insurance Regulatory and Development Authority of… pic.twitter.com/j3KLg4Xg5E
ప్రత్యామ్నాయ మార్గాలు:
1. ఐసీఐసీఐ (ICICI) నుండి గౌలిదొడ్డి వైపు వెళ్లే వారు..
ఐఆర్‌డిఎఐ (IRDAI) జంక్షన్ వద్ద కుడి వైపు టర్న్ తీసుకోవాలి. అక్కడి నుండి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) జంక్షన్ వద్ద ఎడమ వైపునకు.. అక్కడి నుండి నేరుగా గౌలిదొడ్డి వైపు వెళ్లవచ్చు.
2. టీఎన్‌జీఓ (TNGO) జంక్షన్ నుండి కాన్సులేట్ రోడ్డు వైపు వెళ్లే వారు
కృతుంగ రెస్టారెంట్ వద్ద ఎడమ వైపునకు తిరిగి, ప్రిజం (Prism) రోడ్డులోకి వెళ్లాలి.. అక్కడ లెమన్ ట్రీ (Lemon Tree) హోటల్ వద్ద ఎడమ వైపునకు తిరిగి, అక్కడి నుండి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు వెళ్లాలని అధికారులు సూచించారు.
























