'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ బిజినెస్... టోటల్ ఎంత? ఏ ఏరియాలో ఎంత? ఆల్మోస్ట్ 500 కోట్లతో తెరకెక్కిన 'గేమ్ చేంజర్' టోటల్ థియేట్రికల్ బిజినెస్ ఎంత? ఏ ఏరియా నుంచి ఎన్ని కోట్లు వచ్చాయి? అంటే... నైజాంలో రూ. 44 కోట్లకు థియేట్రికల్ రైట్స్ ఇచ్చారని తెలిసింది. రాయలసీమ (సీడెడ్)లో 'గేమ్ చేంజర్' రైట్స్ - రూ. 23 కోట్లు విశాఖ (ఉత్తరాంధ్ర)లో రైట్స్ - రూ. 14. 20 కోట్లు ఈస్ట్ గోదావరి రూ. 10 కోట్లు & వెస్ట్ గోదావరి - రూ. 8.10 కోట్లు గుంటూరులో రూ. 10. 20 కోట్లు కాగా... కృష్ణాలో రూ. 8 కోట్లు, నెల్లూరులో రూ. 4.50 కోట్లకు అమ్మారట. ఏపీ అండ్ తెలంగాణలో టోటల్ థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 122 కోట్లు కర్ణాటకలో ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 14.50 కోట్లు కాగా... తమిళనాడులో రూ. 15 కోట్ల బిజినెస్ జరిగింది. కేరళలో 'గేమ్ చేంజర్' రైట్స్ రూ. 2 కోట్లకు ఇవ్వగా... హిందీ & రెస్టాఫ్ ఇండియా రైట్స్ రూ. 42.50 కోట్లు పలికాయట. ఓవర్సీస్ రైట్స్ ద్వారా 'గేమ్ చేంజర్'కు రూ. 25 కోట్లు వచ్చాయి. 'గేమ్ చేంజర్' టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వేల్యూ రూ. 221 కోట్లు డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావాలంటే 'గేమ్ చేంజర్' రూ. 223 కోట్ల షేర్ రాబట్టాలి. 'గేమ్ చేంజర్'కు 223 కోట్ల రూపాయల షేర్ రావాలంటే గ్రాస్ ఆల్మోస్ట్ దానికి డబుల్, ట్రిబుల్ ఉండాలి.