జాన్వీ కపూర్ రెడ్ వెల్వెట్ డ్రెస్‌లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం సూపర్ స్టన్నింగ్‌గా ముస్తాబైంది. తన బాయ్ ఫ్రెండ్, ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్ పార్టీలో ఎంజాయ్ చేసింది. ఎప్పటిలాగానే తన స్టన్నింగ్ లుక్స్‌తో ఫ్యాషన్ ప్రేమికుల దృష్టిని తనవైపు తిప్పుకుంది. బాడీ హగ్గింగ్ రెడ్ వెల్వెట్ గౌన్‌లో జాన్వీ సూపర్ హాట్‌గా ముస్తాబైంది. ఆమె డ్రెస్‌తో పాటు పెట్టుకున్న నెక్లెస్ కూడా హైప్ పెంచేసింది. మెడలో నెక్లెస్, చేతిరి రింగ్, చెవులకు ఇయర్ రింగ్స్‌తో వచ్చిన డైమండ్ సెట్‌ని జాన్వీ పార్టీకోసం వేసుకుంది. కళ్యాణ్ జ్యూవెలరీ నుంచి ఈ సెట్‌ని తీసుకున్నట్లు జాన్వీ తెలిపింది. అయితే ఈ నెక్లెస్ సెట్ కాస్ట్ అక్షరాల ఆరు లక్షలట. డైమండ్స్, బ్లూ స్టోన్స్‌తో వచ్చిన ఈ సెట్ ఆమెకు పర్ఫెక్ట్ లుక్నిచ్చింది. కేవలం డ్రెస్, జ్యూవెలరీ మాత్రమే కాదు.. తన స్టన్నింగ్ మేకప్ లుక్ కూడా స్టాండర్డ్స్ పెంచేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆ ధరించిన డ్రెస్, నెక్లెస్ గురించిన చర్చ కూడా నెటిజన్లలో ఎక్కువగానే ఉంది.