రణ్​బీర్ కపూర్, ఆలియా భట్​ల గారాలపట్టీ రాహా మరోసారి క్రిస్మస్ ట్రీట్ ఇచ్చేసింది.

సరిగ్గా ఏడాది క్రితం రణ్​బీర్, ఆలియా.. రాహా కపూర్ క్యూట్​ ఫేస్​ని కెమెరా ముందుకు తీసుకువచ్చారు.

2023, డిసెంబర్ 25 క్రిస్మస్ సెలబ్రేషన్స్​కి వెళ్తూ రాహాని మీడియాకు పరిచయం చేసింది ఈ స్టార్ జంట.

ఈ ఏడాది క్రిస్మస్ సెలబ్రేషన్స్​కి కూడా రాహాతో కలిసి వీరిద్దరూ కెమెరాకు ఫోజులిచ్చారు.

అయితే గత ఏడాది కేవలం నవ్వులే పంచిన రాహా ఈ ఏడాది తన గ్రోత్​ని చూపించింది.

అందరికీ మేర్రీ.. క్రిస్మస్​ అంటూ క్యూట్​గా విష్ చేసి అందరినీ షాక్​కి గురి చేసింది.

ఈ క్యూట్​ మాటాల నుంచి తేరుకునేలోపే.. వెళ్తూ వెళ్తూ అందరికీ బాయ్ చెప్పింది.

బాయ్​తో పాటు బోనస్​గా అందరికీ ఫ్లైయింగ్ కిస్సెస్ ఇచ్చి రియల్ క్రిస్మస్​ ట్రీట్​ ఇచ్చింది ఈ క్యూటీ.

సోషల్ మీడియాలో రాహా క్యూట్ మూమెంట్స్​ని అభిమానులు షేర్ చేస్తున్నారు.

సంవత్సరంలో ఎంత ఎదిగిపోయిందంటూ.. దిష్టి పెట్టొద్దంటూ.. పోస్ట్​లు చేస్తున్నారు.