హీరోయిన్‌గా కాదు... ఈ సినిమాల్లో అమృతా అయ్యర్ క్యారెక్టర్ రోల్స్ చేసిందని తెలుసా?

పాన్ ఇండియా హిట్ 'హనుమాన్'లో అమృతా అయ్యర్ హీరోయిన్. ఆమె కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అది.

'హనుమాన్'కు ముందు ప్రదీప్ మాచిరాజు '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?'లోనూ అమృత హీరోయిన్‌గా నటించారు.

'హనుమాన్', '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' మధ్యలో శ్రీవిష్ణు 'అర్జున ఫాల్గుణ' చేశారు అమృత. అది ఫ్లాప్.

హీరోయిన్‌గా అమృతా అయ్యర్ తెలుగు సినిమాలు చేయడానికి ముందు తమిళ సినిమాల్లో క్యారెక్టర్లు చేశారు.

తెలుగులో రామ్ పోతినేని 'రెడ్'లో అమృతాను హీరోయిన్ అని చెప్పలేం. ఆవిడ ఓ రోల్ చేశారు.

దళపతి విజయ్ 'బిగిల్' (తెలుగులో 'విజిల్')లో అమృతా అయ్యర్ ఒక కీ రోల్ చేశారు.

దళపతి విజయ్ 'తెరి' (తెలుగులో 'అదిరింది')లోనూ అమృతా అయ్యర్ కీలక పాత్ర చేశారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ 'లింగా' సినిమాలో కూడా అమృతా అయ్యర్ క్యారెక్టర్ చేశారు.

అల్లరి నరేష్ 'బచ్చల మల్లి' సినిమాలో అమృతా అయ్యర్ హీరోయిన్‌గా చేశారు.