గోవాలో పెళ్లి... ముందు 15 ఏళ్ల ప్రేమ... మహానటి మ్యారేజ్ కహానీ తెల్సా?

గోవాలో కుటుంబ సభ్యులు, కొందరు స్నేహితుల సమక్షంలో డిసెంబర్ 12, 2024న కీర్తి సురేష్ పెళ్లి చేసుకున్నారు.

కీర్తి సురేష్ భర్త పేరు ఆంటోనీ తట్టిల్. ఆయన కూడా మలయాళీ. కీర్తికి చిన్ననాటి నుంచి స్నేహితుడు.

ఆంటోనీతో తనది 15 ఏళ్ళ ప్రేమ అని పెళ్లికి కొన్ని రోజుల ముందు కీర్తి అనౌన్స్ చేశారు. 

కీర్తి భర్త ఆంటోనీ కేరళలో జన్మించినా దుబాయ్ లో సెటిల్ అయ్యారు. ఆయన బిజినెస్ మెన్. 

కీర్తి సురేష్ కుక్కపిల్ల పేరు Iykyk. తమ పేర్లు నుంచి (AntoNY x KEerthy) ఆ పేరు పెట్టామని చెప్పింది.

కేరళ అయ్యంగార్ స్టైల్ లో కీర్తి సురేష్, ఆంటోనీ పెళ్లి చేసుకున్నారు. నవ్వుల పండుగగా వివాహం జరిగింది.

పెళ్లి తర్వాత కూడా కీర్తి సురేష్ సినిమాల్లో నటిస్తారని తెలిసింది. ఆమె పెళ్లికి విజయ్ అటెండ్ అయ్యారు.

ఆంటోనీతో కలిసి సోషల్ మీడియాలో కీర్తి సురేష్ షేర్ చేసిన ఫస్ట్ ఫోటో ఇదే.