కత్రినా కైఫ్​కు ఫ్యాన్ బాయ్ నుంచి హస్బెండ్​గా మారాడు విక్కీ కౌశల్.

నేటితో వారు పెళ్లి చేసుకుని మూడో సంవత్సరం. ఈ స్పెషల్ డే సందర్భంగా వారి లవ్​ స్టోరి చూసేద్దాం.

ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రెటీలకు పెళ్లిళ్ల వేదికగా పేరుగాంచింది కాఫీ విత్ కరణ్ షో.

విక్కీ, కత్రినా పెళ్లికి కూడా ఈ టాక్​ షోనే నాంది పలికింది. వారి లవ్​ ట్రాక్ ఆ షో నుంచే మొదలైంది.

ఆ షోలో పాల్గొన్న కత్రినా.. నేను, విక్కీకౌశల్ కలిసి ఉంటే చూడడానికి బాగుంటుందంటూ స్టేట్​మెంట్ పాస్ చేసింది.

ఈ స్టేట్​మెంట్​ను కరణ్.. విక్కీ దగ్గర రివీల్ చేయగా.. సంతోషంతో ఉబ్బితబ్బిబి అయిపోయాడు విక్కీ.

ఆ తర్వాత వీరు పలు ఈవెంట్లలో కలవడం, డేటింగ్ చేయడం, ప్రేమ, పెళ్లి ఇలా వరుసగా జరిగిపోయాయి.

పెద్దల సమక్షంలో డిసెంబర్ 9, 2021న వీరు పెళ్లి చేసుకున్నారు.

విక్కీ ఎన్నోసార్లు కత్రినాపై ఉన్న ప్రేమ, అభిమానాన్ని బహిరంగంగానే వ్యక్తం చేశాడు. ఇప్పటికీ చేస్తూనే ఉంటాడు.

పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ తమ తమ కెరీర్​లో ముందుకు వెళ్తూ.. హ్యాపీగా లైఫ్​ని ముందుకు తీసుకువెళ్తున్నారు.