శోభిత, నాగచైతన్య పెళ్లి అన్నపూర్ణ స్టూడియోలో డిసెంబర్ 4, 2024న అంగరంగ వైభవంగా జరిగింది.

నాగ చైతన్య పంచకట్టులో పెళ్లికొడుకు లుక్​లో చాలా అందంగా నవ్వుతూ కనిపించాడు.

శోభిత బంగారు రంగు చీరలో.. నిండైన నగలతో సిగ్గుపడుతూ నవ్వుతూ కనిపించింది.

అక్కినేని ఫ్యాన్స్ మెచ్చిన ఫోటో ఇది. బ్యాక్​గ్రౌండ్​లో ఎన్నార్ శోభిత, చైకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్లే ఉంది ఈ ఫోటో.

నాగ చైతన్య విడాకుల తర్వాత శోభితతో ప్రేమలో పడ్డాడు. అనంతరం వీరు ట్రిప్స్​కి వెళ్లారు.

రూమర్స్​కి చెక్​ పెడుతూ ఆగస్ట్ 8, 2024వ తేదీన వీరు ఎంగేజ్​మెంట్ చేసుకున్నారు.

అప్పుడూ వీరి ఎంగేజ్​మెంట్​ ఫోటోలు షేర్ చేసిన నాగార్జున.. ఇప్పుడు పెళ్లి ఫోటోలు షేర్ చేశారు.

మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ కోడలికి అఫీషయల్​గా నోట్​ రాసేశాడు నాగ్ ​మామ.

సోషల్ మీడియాలో శోభిత, చైతన్యలకు విషెష్ చెప్తూ.. నెటిజన్లు ఫోటోలు షేర్ చేస్తున్నారు.

కలకాలం సంతోషంగా ఉండాలని విష్ చేస్తున్నారు.