నటుడు మోహన్ బాబు మాట్లాడిన ఆడియో వైరల్ అవుతోంది. మనోజ్ నీ వల్లే మీ అమ్మ ఆస్పత్రిలో చేరిందని మోహన్ బాబు అన్నారు

భార్య మాటలు విని నా గుండెలపై తన్నావ్‌ మనోజ్‌, తాగుడుకు అలవాటుకు పడి చెడు మార్గంలో వెళ్తున్నావు: మోహన్‌బాబు

ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి‌, బతుకుదెరువు కోసం వచ్చిన పనివాళ్లను కొట్టడం మహాపాపం: మోహన్‌ బాబు

నీకు ఏ ఆస్తులు వద్దు అన్నావ్, యాక్టింగ్ చేసుకుంటా అని చెప్పిన మాట ఏమైంది మనోజ్‌: మోహన్‌ బాబు

అన్నతో పాటు వినయ్‌ను కొట్టడానికి వచ్చావు, నీ అన్న విష్ణును చంపుతానని అన్నావు: మోహన్‌ బాబు

రోడ్డుకెక్కి నా పరువు తీశావు, నా ఇంట్లోకి అడుగుపెట్టడానికి మనోజ్‌కు అర్హత లేదు: మోహన్‌ బాబు

ఇది నా కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లు, ముగ్గురికి ఆస్తులు సమానంగా రాయాలా, వద్దా అనేది నా ఇష్టం: మోహన్‌ బాబు

చిన్న కొడుకు మంచు మనోజ్ నన్ను కొట్టలేదు, అయితే ఓ విషయంలో మేమిద్దరం ఘర్షణ పడ్డాం: మోహన్‌ బాబు

ఓ రాజకీయ నాయకుడు మనోజ్‌కు సపోర్ట్ చేస్తున్నాడు, ఇంట్లోకి నువ్వే అక్రమంగా చొరబడ్డావ్: మోహన్‌ బాబు

హాస్పిటల్ నుంచి మీ అమ్మ డిశ్ఛార్జ్ అయ్యాక, పోలీసుల సమక్షంలోనే నీ బిడ్డను నీకు అప్పగిస్తా: మోహన్‌ బాబు