పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతిచెందిన కేసులో అల్లు అర్జున్ అరెస్టయ్యారు

అల్లు అర్జున్‌ను పోలీసులు నాంపల్లి కోర్టుకు తరలించారు. ఆ సమయంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నటుడు అల్లు అర్జున్‌ను ఓదార్చారు.

అంతా సవ్యంగా జరుగుతుందని, ఆందోళన చెందవద్దని అల్లు అర్జున్‌ను త్రివిక్రమ్ వెన్ను తట్టిన వీడియో వైరల్ అవుతోంది

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మృతి కేసులో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది

అల్లు అర్జున్ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నాంపల్లి కోర్టుకు వచ్చారు.

పుష్ప2 ప్రీమియర్ సందర్భంగా బందోబస్తు, రక్షణ కోసం సంధ్య 70mm థియేటర్ పోలీసులకు రాసిన లేఖను బయటపెట్టింది

ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను ఏ11గా చేర్చినట్లు నాంపల్లి కోర్టుకు ఏసీపీ తెలిపారు.

అల్లు అర్జున్‌ను చంచల్ గూడ జైలుకు తరలించడానికి పోలీసులు ఆ మార్గంలో ట్రాఫిక్ క్లియర్ చేసి రూట్ సిద్ధం చేస్తున్నారు.