తెలుగు ప్రేక్షకులకు..

నజ్రియా అంటే మొదటిగా గుర్తొచ్చే సినిమా రాజా రాణి. డబ్బింగ్ సినిమా అయినా తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్​ని సంపాదించుకుంది నజ్రియా.

Published by: Geddam Vijaya Madhuri

చైల్డ్ ఆర్టిస్ట్​గా

నజ్రియా చైల్డ్ ఆర్టిస్ట్​గా కెరీర్​ను ప్రారంభించింది. అనంతరం మలయాళం, తమిళం, తెలుగు సినిమాల్లో నటిస్తూ కెరీర్​ను ముందుకు తీసుకెళ్తోంది.

బెస్ట్ సినిమాలు

నజ్రియా హీరోయిన్​గా చేసిన కొన్ని సినిమాలు.. వేరే భాషల్లో చూసినా కూడా ఆమె నటనకు ఫిదా అవ్వాల్సిందే. నజ్రియా నటనలో బెస్ట్ ఇచ్చిన సినిమాలేంటో ఇప్పుడు చూసేద్దాం.

వాయై మూడి పెసవుం

దుల్కర్ సల్మాన్ హీరోగా, నజ్రియా హీరోయిన్​గా చేసిన ఈ సినిమా తమిళ్​లో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నజ్రియా నటనకు మంచి మార్కులు లభించాయి. ఈ సినిమా జీ5లో స్ట్రీమ్ అవుతుంది.

బెంగళూరు డేస్

బెంగళూరు డేస్​ భాషతో సంబంధం లేకుండా హిట్​ టాక్​ను సంపాదించుకుంది. ఈ సినిమాలో నజ్రియా నటనకు ఫిదా అవ్వని వారుండరు. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్​లో స్ట్రీమ్ అవుతుంది.

రాజా రాణి

సినిమాలో నజ్రియా పాత్ర తక్కువే అయినా.. ఇంపాక్ట్ ఉండే క్యారెక్టర్​ ఆమెది. ఈ సినిమాలో ఆమె చనిపోయినా.. బ్రదర్ అనే వర్డ్​తో యూత్​లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమా కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్​లో స్ట్రీమ్ అవుతుంది.

కూడే (Koode)

సైకలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మలయాళం సినిమాతో నజ్రియాకు మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాకు ఏసియనెట్​ ఫిల్మ్ అవార్డ్స్​, ఫిల్మ్​ ఫేర్ అవార్డ్స్​లో బెస్ట్ హీరోయిన్​గా నామినేట్ అయింది. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్​స్టార్​లో స్ట్రీమ్ అవుతుంది.

నేరం (Neram)

నివిన్ పాల్​తో చేసిన ఈ సినిమాలో సాంగ్స్ సూపర్​ హిట్​. అలాగే ఈ సినిమాలో నజ్రియా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది.

ట్రాన్స్ (Trance)

పాస్టర్లు ప్రజల్ని మోసం చేస్తోన్న విధానాన్ని తెరపైకి తీసుకొచ్చిన చిత్రం ట్రాన్స్. దీనిలో ఫాహాద్ ఫజిల్, ఈ సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది.

అంటే సుందరానికి..

ఈ సినిమా కమర్షియల్​గా హిట్​ కాకపోయినా.. నజ్రియా నటనకు తెలుగు యువత ఫిదా అయ్యారు. ప్రేక్షకులు కమర్షియల్ హిట్ చేయలేదు కానీ.. సినిమాకు మాత్రం బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమా నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమ్ అవుతుంది.

సూక్ష్మదర్శిని

తాజాగా విడుదలైన ఈ చిత్రంలో కూడా నజ్రియా మంచి పాత్రను పోషించింది. తనదైన నటనతో అభిమానులను ఎంటర్​టైన్ చేసింది.