బచ్చల మల్లి ప్రీ రిలీజ్ బిజినెస్... అల్లరి నరేష్ ముందున్న టార్గెట్ ఎంతంటే?

అల్లరి నరేష్, అమృతా అయ్యర్ జంటగా నటించిన 'బచ్చల మల్లి' విడుదల డిసెంబర్ 20, 2024న.

ఏపీలో అన్ని ఏరియాలను కలిపి రూ. 2.2 కోట్లకు 'బచ్చల మల్లి' సినిమాను అమ్మేశారట.

బచ్చల మల్లి రాయలసీమ (సీడెడ్) ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం రూ. 60 లక్షలు అని తెలిసింది.

నైజాం (తెలంగాణ)లో 'బచ్చల మల్లి' థియేట్రికల్ రైట్స్ ద్వారా మంచి అమౌంట్ రూ. 1.40 కోట్లు వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో 'బచ్చల మల్లి' థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 4.2 కోట్లు.

ఓవర్సీస్ రైట్స్ ద్వారా 'బచ్చల మల్లి' నిర్మాతలకు రూ. 80 లక్షలు వచ్చినట్టు సమాచారం.

'బచ్చల మల్లి' టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 5 కోట్లు అని చెప్పాలి.

థియేట్రికల్ కలెక్షన్స్ ద్వారా రూ. 5.50 కోట్లు షేర్ వస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయినట్టు.