రాజమౌళి సినిమాలో మహేశ్ బాబుకి జోడిగా ప్రియాంక చోప్రా!?

సూపర్​స్టార్ మహేశ్​ బాబు హీరోగా.. రాజమౌళి దర్శకత్వంలో వస్తోన్న సినిమాపై రోజు రోజుకి హైప్ పెరుగుతుంది.

ఇప్పటికే సినిమా కోసం మహేశ్ బాబు తన లుక్స్​ని మార్చుకొంటూ, ఫిట్​నెస్​పై ఫోకస్ పెట్టారు.

రాజమౌళి కూడా సెట్స్ వేటతో పాటు ప్రీ ప్రొడక్షన్​పై ఫోకస్ పెట్టేశారు.

ఈ సమయంలో బయటకు వచ్చిన హాట్ న్యూస్ ఏంటంటే ప్రియాంక చోప్రా కూడా మహేశ్​తో స్క్రీన్ షేర్ చేసుకోనుందట.

ఇదే నిజమైతే దాదాపు ఆరేళ్ల తర్వాత ప్రియాంక చోప్రా ఇండియన్​ సినిమాకు రీ ఎంట్రీ ఇవ్వనుంది.

దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

బాలీవుడ్ సినిమాలకు ప్రియాంక దూరమైపోయినట్లేనా అనుకునే సమయంలో.. పాన్ ఇండియా మూవీతో రీఎంట్రీ ఇస్తోంది బ్యూటీ.

42 ఏళ్ల ఈ భామ ఇప్పటికీ తన స్టన్నింగ్ లుక్స్​తో, మాటలతో, ఆలోచనలతో అందరినీ అలరిస్తూ ఉంటుంది.

ఇప్పుడు రాజమౌళి సినిమాలో, మహేశ్ సరసన ప్రియాంకను చూసేందుకు అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.