చిరు తనయుడిగా.. 'చిరుత' సినిమాతో 2007లో టాలీవుడ్​లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్.

రెండో చిత్రం మగధీరతో.. ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్లు కొల్లగొట్టాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

నాయక్​లో డ్యూయల్ రోల్ చేసినా, బాలీవుడ్​లో జంజీర్​తో ఎంట్రీ ఇచ్చినా.. రెండూ నిరాశే పరిచాయి.

తర్వాత న్యూ కాన్సెప్ట్ ఆరెంజ్​తో వచ్చాడు కానీ అది ఆశించిన ఫలితం ఇవ్వలేదు. రచ్చ సినిమా పరిస్థితి కూడా అంతే.

ముందు సినిమాలతో తగ్గిన గ్రాఫ్​ని నాయక్ సినిమాతో మళ్లీ పెంచుకుని సంక్రాంతి హిట్ కొట్టాడు చెర్రీ.

గోవిందుడు అందరి వాడేలే, బ్రూస్​లీ, ధృవ వంటి సినిమాలు చెర్రీ కెరీర్​లో మంచి హిట్స్​గా నిలిచాయి.

రంగస్థలం సినిమాతో తనలోని నటుడిని కొత్తగా ఆవిష్కరించాడు చరణ్. దీనిలో నేషనల్ అవార్డ్ లెవెల్ పర్​ఫార్మెన్స్ ఇచ్చాడు చెర్రీ.

2018లో హయ్యేస్ట్ గ్రాస్ ఫిల్మ్​గా రంగస్థలం నిలిచింది. తర్వాత వచ్చిన వినయ విదేయ రామ నిరాశను మిగిల్చింది.

RRR సినిమాతో రామ్​ చరణ్ గ్లోబల్ స్టార్​గా ఎదిగాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్​తో కలిసి చరణ్ చేసిన రచ్చకు ఆస్కార్ కూడా తల వొంచింది.

ఆచార్య సినిమా తర్వాత.. ఇప్పుడు చరణ్ శంకర్ దర్శకత్వంలో వస్తోన్న గేమ్​ ఛేంజర్​తో వస్తున్నాడు.

సంక్రాంతి కానుకగా.. జనవరి 10, 2025న థియేటర్లలో సందడి చేయనున్నాడు చెర్రీ.