అన్వేషించండి

Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!

Southern Spice : బీజేపీపై పోరాటానికి కేటీఆర్, రేవంత్ చేతులు కలపనున్నారు. శనివారం చెన్నైలో స్టాలిన్ నేతృత్వంలో జరగనున్న సమావేశానికి హాజరు కానున్నారు.

KTR and Revanth will join hands:  సీఎం రేవంత్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ మధ్య ఏ అంశంలోనూ ఏకాభిప్రయం ఉండదని అనుకుంటారు. కానీ.. దక్షిణాదికి అన్యాయం విషయంలో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం వచ్చింది. స్టాలిన్ నేతృత్వంలో పోరాడేందుకు వారు సిద్ధమయ్యారు. శనివారం చెన్నైలో నిర్వహిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు చెందిన కీలక పార్టీల నేతల సమావేశానికి రేవంత్ తో పాటు కేటీఆర్ కూడా హాజరవుతున్నారు. ఇరువురూ చెన్నైకి బయలుదేరి వెళ్లారు. 

సీనియర్ నేతలతో కలిసి చెన్నైకి కేటీఆర్ 

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం చెన్నైకి వెళ్లింది. డీలిమిటేషన్ విధానంపై చర్చించేందుకు చెన్నైలో  జరగనున్న దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో పాల్గొననున్నారు.  ఈ సదస్సులో ప్రస్తుత డీలిమిటేషన్ విధానం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న , భవిష్యత్తులో జరగబోయే నష్టాలను ఎండగడుతూ, ఈ అన్యాయాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేటీఆర్ ప్రసంగించనున్నారు. కేటీఆర్ నాయకత్వంలో పలువురు బిఅర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులతో కూడిన బృందం ఈ సమావేశంలో పాల్గొననుంది.  ప్రస్తుత డీలిమిటేషన్ విధానం దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని బలహీనపరుస్తుందని, దీని వల్ల దేశ ఆర్థికాభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్న ఈ రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని కేటీఆర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఆది నుంచి ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్, తన పార్టీ విధానాన్ని రేపటి సమావేశంలో వివరించనుంది. దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి, దాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ, ఈ అంశంలో అందరికన్నా ముందుండి పోరాడుతున్న పార్టీ భారత రాష్ట్ర సమితి అని కేటీఆర్ పేర్కొన్నారు. రేపటి సమావేశం తర్వాత దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకతాటిపైకి వచ్చి, దేశ ప్రగతికి బాటలు వేసిన ఈ రాష్ట్రాల ప్రజల భవిష్యత్తు కోసం కలిసి నిలబడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశం దక్షిణాది రాష్ట్రాల ఐక్యతను బలోపేతం చేసి, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ విధానంపై బలమైన వ్యతిరేకతను కేంద్రానికి చాటనుందని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది.

స్టాలిన్ సమావేశంలో పాల్గొననున్న రేవంత్, మహేష్ కుమార్ గౌడ్

మరో వైపు  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్  మహేష్ గౌడ్ హాజరవుతున్నారు. కర్ణాటక నుంచి డిప్యూటీ సీఎం శివకుమార్ హాజరవుతున్నారు. తెలంగాణ సీఎం కూడా హాజరవ్వాలని శుక్రవారమే నిర్ణయించుకున్నారు.. స్టాలిన్ ఇండియా కూటమిలో కీలక నేత. ఆయన నిర్వహించే సమావేశానికి స్థాయి తగ్గకండా వెళ్లాలని హైకమాండ్ సూచించడంతో రేవంత్ కూడా వెళ్తున్నారు. ముందుగా పీసీసీ చీఫ్ ను పంపాలనుకున్నారు.ఇప్పుడు ఇద్దరూ వెళ్లనున్నారు. 

బీజేపీపై కలసి పోరాడేందుకు వేదిక 

 ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పై పోరాడుతోంది.మరో వైపు ఆ  పార్టీ తో కలిసి బీజేపీపై పోరాడేందుకు సిద్ధమవుతోంది. ఇది తెలంగాణలో కొన్ని రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ బీజేపీని .. బీఆర్ఎస్ పల్లెత్తు మాట అనడం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ తోనూ కలిసి పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని బీఆర్ఎస్ ఎలా తన రాజకీయ విధానాలకు అనుగుణంగా మార్చుకుంటారన్నది ఆసక్తికరం. 

టాప్ హెడ్ లైన్స్

Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Telangana Congress Rift: కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?
కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?
Ponguleti Srinivas Reddy: రేవంత్ సర్కార్‌కు మంత్రి పొంగులేటి సమస్యగా మారారా? కాంగ్రెస్ ల్యాండ్ మార్క్ గ్రాఫ్‌కు గండి కొడుతున్నాయా?
రేవంత్ సర్కార్‌కు మంత్రి పొంగులేటి సమస్యగా మారారా? కాంగ్రెస్ ల్యాండ్ మార్క్ గ్రాఫ్‌కు గండి కొడుతున్నాయా?
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Embed widget