Lady Don Sangeetha Sahu: ఒడిషాలో గంజాయి డాన్ సంగీత సాహు అరెస్ట్ - అబ్బో ఈమె కళాపోషణ చూసి తరించాల్సిందే !
Lady don Ganja Case: లేడీ డాన్ సంగీత సాహును ఒడిషాలో హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి హోల్ సేల్ వ్యాపారం చేస్తున్న ఆమెపై పలు కేసులు నమోదయ్యాయి.

Lady don Sangeetha Sahu arrest: హైదరాబాద్‌కు గంజాయిని సరఫరా చేస్తున్న వారిపై పోలీసులు నిఘా పెట్టి ఓ సంచలన విషయాన్ని కనిపెట్టారు. సంగీతా సాహు అనే మహిళ హైదరాబాద్ కు పెద్ద ఎత్తున గంజాయి సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు. ఇప్పటికే సంగీతా సాహుపై సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ లో ఒక కేసు, ధూల్ పేట్ లో 4 కేసులు ఆమెపై నమోదయ్యాయి. దీంతో ఆమెపై నిఘా పెట్టిన హైదరాబాద్ పోలీసులు ఒడిషాకు వెళ్లి పట్టుకున్నారు. అరెస్టు చేసి తీసుకు వచ్చారు. గంజాయి స్మగ్లింగ్ లో ఈమె లేడీ డాన్ గా పేరు తెచ్చుకున్నారు. అనేక రాష్ట్రాల్లోని గంజాయి వ్యాపారస్తులతో పరిచయాలు ఉన్నాయి. నాలుగేళ్ల క్రితం గంజాయి హోల్ సేల్ వ్యాపారంలోకి దిగిన సంగీతా సాహు తన వ్యాపారాన్ని విస్తరించారు. ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి.
Odisha’s Ganja Lady Don Arrested!
— Hyderabad Mail (@Hyderabad_Mail) March 26, 2025
Odisha-based drug mafia queen Sangeeta Sahu alias Geeta Sahu has been arrested by Telangana’s Special Task Force (STF). She was involved in five drug cases in Telangana, including major ganja supply operations in Dhoolpet & Secunderabad.
Known… pic.twitter.com/4Yv8pY3NXu
సంగీత సాహు ప్రొఫెషనల్ గా గంజాయి స్మగ్లింగ్ డాన్ కావొచ్చు కానీ.. ఆమెకు మంచి అభిరుచి ఉంది. విపరీతంగా వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పెట్టుకుంటారు. ఇన్ స్టా అంటే ఆమెకు పిచ్చి. గ్లామరస్ వీడియోలు తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేసుకుంటూ ఉంచారు. ఆమె సోషల్ మీడియా యాక్టివిటీ వల్లనే పోలీసులు ఒరిషాలో ఉన్నట్లుగా గుర్తించి అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది.
సంగీత సాహుకు మరో పేరు కూడా ఉంది. గీతా సాహు అనే పేరుతో కొంత మంది పిలుస్తారు. ఇన్‌స్టాగ్రామ్‌లో గ్లామరస్ వీడియోలను పోస్ట్ చేయడంలో ప్రసిద్ధి చెందిన సంగీత నాలుగు సంవత్సరాలుగా రహస్యంగా హోల్‌సేల్ గంజాయి వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. అంతర్రాష్ట్ర సరఫరాదారులతో ఒప్పందాలు కుదుర్చుకుంది. స్థానిక పోలీసుల మద్దతుతో కాలికోట్ నుండి ఆమెను పట్టుకోవడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నంద్యాల అంజి రెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక బృందాన్ని ఒడిశాకు పంపింది. ఆమెను 2022లో హైదరాబాద్‌కు గంజాయిని స్మగ్లింగ్ చేస్తుండగా సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆ తర్వాత స్వయంగా స్మగ్లింగ్ చేయకుండా హోల్ సేల్ వ్యాపారం ప్రారంభినట్లుగా గుర్తించారు.
View this post on Instagram
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గంజాయి కేసులను చాలా సీరియస్ గా తీసుకుంటోంది. డ్రగ్స్ ఎక్కడ కనిపించినా కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో అసుల హైదరాబాద్‌కు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న వారిపై దృష్టి సారించి మూలాలను వెలికి తీయాలనుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఎక్కువగా సంగీత సాహునే గంజాయి పంపుతున్నట్లుగా తెలుసుకుని ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి అరెస్టు చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

