#Hidden Agenda at TDP Social Media | టీడీపీ సోషల్ మీడియాలో సొంత పార్టీపైనే ఎటాక్స్..అసలు రీజన్ ఇదేనా | ABP Desam
సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీపై మాటల దాడులతో పార్టీలు యాక్టివ్‌గా ఉంటాయి. కానీ ఏపీలో అధికార పార్టీ టీడీపీ మాత్రం హైపర్ యాక్టివ్. ప్రత్యర్థులపై దాడుల కంటే.. సొంత పార్టీ నాయకత్వంపై ఎక్కువ ఎటాక్ చేస్తుంటుంది. అలా చేసే పరిస్థితి పార్టీ కల్పించిందా.. సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎక్కువ చొరవ తీసుకుంటున్నారా అన్నది ఎప్పటికీ తెగని ఇష్యూ.. #Hidden Agenda @TDP సోషల్ మీడియా నిండా… !
తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సొంత పార్టీ కార్యకర్తల నుంచే ఊహించని షాక్ మొదలైంది. గడచిన ఐదేళ్లలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని .. ఎదురొడ్డి పార్టీని నిలిపామని భావిస్తున్న హార్డ్ కోర్ టీడీపీ అభిమానులు.. కూటమి ప్రభుత్వం తప్పు చేయడానికి వీల్లేదని భావిస్తున్న పార్టీ మేధావులు, దెబ్బకు దెబ్బ తీయాలని కసి మీదున్న తెలుగు తమ్ముళ్లు.. వీళ్లంతా కూడా కొంచం యాక్టివ్‌గానే ఉంటున్నారు. దాదాపు ౩౦ ఏళ్లుగా చంద్రబాబు మాటే శాసనంగా నమ్ముతూ వస్తున్న తెలుగు తమ్ముళ్లు కాస్త కట్టుతప్పుతున్నారు. అది తప్పేం కాదు.. మా హక్కు అని కూడా వాదిస్తున్నారు. ఇంత వరకూ వారి ఎమోషనే్ను అర్థం చేసుకోవాలి.





















