అన్వేషించండి

Testosterone Test : టెస్టోస్టెరాన్ టెస్ట్ అంటే ఏంటి? నిజంగానే ఇది పురుషుల లైంగిక సామర్థ్యాన్ని డిసైడ్ చేస్తుందా?

Testosterone : పెళ్లికి ముందే టెస్టోస్టెరాన్ టెస్ట్ చేయించుకోవాలంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్​లు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ టెస్ట్ ఏంటి? టెస్టోస్టెరాన్ గురించిన పూర్తి వివరాలు చూసేద్దాం.  

Testosterone Test For Men : టెస్టోస్టెరాన్ అనేది రిప్రొడెక్టివ్ హెల్త్​కి అత్యంత అవసరమైన, ముఖ్యమైన హార్మోన్. ఇది మగవారిలోనే కాదు ఆడవారిలో కూడా ఉంటుంది. ఇప్పుడు దీని గురించిన డిస్కషన్ ఎందుకంటే.. సోషల్ మీడియాలో మగవాళ్లు అందరూ పెళ్లికి ముందే టెస్టోస్టెరాన్ టెస్ట్ చేయించుకోవాలంటూ పోస్ట్​లు వైరల్ అవుతున్నాయి. అసలు టెస్టోస్టెరాన్ టెస్ట్ అంటే ఏంటి? ఈ హార్మోన్ వల్ల కలిగే లాభాలు ఏంటి? మగవారిలో ఇది ఎంత ఉండాలి? తక్కువగా ఉంటే కలిగే నష్టాలు, ఎక్కువగా ఉంటే వచ్చే ఇబ్బందులు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

టెస్టోస్టెరాన్ టెస్ట్ ఎలా చేస్తారు?

టెస్టోస్టెరాన్ టెస్ట్​ను చాలామంది స్పెర్మ్ టెస్ట్ అనుకుంటారు కానీ.. దీనిని బ్లడ్ టెస్ట్ ద్వారా నిర్థారిస్తారు. చేతి నుంచి బ్లడ్​ శాంపిల్స్ తీసుకుని టెస్ట్ చేస్తారు. టెస్టోస్టెరాన్ స్థాయిలు సాధారణంగా ఉదయం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ టెస్ట్​ని ఉదయం 7 నుంచి 20 గంటల మధ్య ఎక్కువగా చేస్తారు. 

టెస్టోస్టెరాన్ ఎంత ఉండాలంటే.. 

టెస్టోస్టెరాన్ అనేది మగవారిలో వృషణాలలో ఎక్కువగా.. స్త్రీలలో అండాశయాలలో తక్కువ మోతాదులో ఉత్పత్తి అయ్యే స్టెరాయిడ్ హార్మోన్. అయితే ఇది మగవారిలో ఎంత ఉండాలంటే.. 300-1,000 ng/dL ఉండాలి. ఆడవారిలో ఇది 15-70 ng/dL ఉంటుంది. 

టెస్టోస్టెరాన్ టెస్ట్ ఎందుకు చేస్తారు?

లైంగిక సామర్థ్యం, ఫెర్టిలిటీ సమస్యలు, ఇతర సమస్యలను గుర్తించడానికి ఈ టెస్ట్ చేస్తారు. ఆ రిజల్ట్​లో టెస్టోస్టెరాన్ తక్కువగా ఉంటే దానిని హైపోగోనాడిజం(Low Testosterone-Hypogonadism)గా గుర్తిస్తారు. తక్కువ టెస్టోస్టెరాన్.. హైపోగోనాడిజం, పిట్యూటరీ గ్రంథి సమస్యలు, ఇతర వైద్య సమస్యలను సూచిస్తుంది. దీనివల్ల మగవారిలో సెక్స్​ డ్రైవ్​ని తగ్గుతుంది. అలసట, అంగస్తంభన వంటి లక్షణాలను ఎక్కువగా ఉంటాయి. మూడ్ స్వింగ్స్, డిప్రెషన్, యాంగ్జైటీని సూచిస్తుంది.

టెస్టోస్టెరాన్ ఎక్కువగా ఉన్నట్లు రిజల్ట్ వస్తే దానిని హైపర్​గోనాడిజం (High Testosterone-Hypergonadism) అంటారు. వృషణ కణితులు లేదా ఇతర వైద్య సమస్యలను ఇది ఇండికేట్ చేస్తుంది. ఇది ముఖంపై మొటిమలు, మానసికంగా కోపాన్ని, ఫెర్టిలిటీ సమస్యలను నిర్ధారిస్తుంది. వంధ్యత్వం సమస్యలను గుర్తించడానికి, ఆ సమస్యను అంచనా వేయడానికి ఈ టెస్ట్ చేస్తారు. అంతేకాకుండా బట్టతలకు కూడా కారణమవుతుంది.

టెస్టోస్టెరాన్ టెస్ట్​లో రకాలు, స్థాయిలు 

ఈ టెస్టోస్టెరాన్​ను మూడు రకాలుగా పరీక్షిస్తారు. దానిలో Total Testosterone ఒకటి. దీనిలో భాగంగా రక్తంలో మొత్తం టెస్టోస్టెరాన్​ని లెక్కిస్తారు. ఈ టెస్ట్​లో రిజల్ట్​ 300-1,000 ng/dL ఉండాలి. రెండోది ఫ్రీ టెస్టోస్టెరాన్(Free Testosterone). రక్తంలోని ప్రోటీన్ల వల్ల కోల్పోతున్న టెస్టోస్టెరాన్ మొత్తాన్ని గుర్తిస్తారు. ఇది 5-20 ng/dL ఉండాలి. మూడోది బయో అవైలబుల్ టెస్టోస్టెరాన్ (Bioavailable Testosterone). శరీరం ఉపయోగించడానికి అందుబాటులో ఉన్న టెస్టోస్టెరాన్​ని ఇది సూచిస్తుంది. ఇది 150-500 ng/dL స్థాయిలు ఉండాలి. 

మీ టెస్టోస్టెరాన్ స్థాయిలు అసాధారణంగా ఉంటే వైద్యులు ఇతర టెస్ట్​లు చేస్తారు. తక్కువ టెస్టోస్టెరాన్ ఉంటే దానికోసం టెస్టోస్టెరాన్ రిప్లెస్​మెంట్ ట్రీట్​మెంట్ (Testosterone Replacement Therapy) చేస్తారు. దీనిలో భాగంగా రెగ్యులర్​గా టెస్టోస్టెరాన్ ఇంజక్షన్లు చేస్తారు. టాపికల్ జెల్స్​ని శరీరానికి అప్లై చేస్తారు. కొన్ని రకాల ప్యాచ్​లు కూడా టెస్టోస్టెరాన్ స్థాయిలను బ్యాలెన్స్ చేస్తాయి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget