అన్వేషించండి

BRS Assembly Boycott: బీఆర్ఎస్ అసెంబ్లీ బహిష్కరణ - అసెంబ్లీని గాంధీభవన్‌లా నిర్వహిస్తున్నారని ఆగ్రహం

BRS: అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. జల వివాదాలపై మంగళవారం ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.

BRS decided to boycott ssembly sessions:భారత రాష్ట్ర సమితి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ నడుపుతున్నారా లేక  సీఎల్పీ మీటింగ్ నడుపుతున్నారా అని బీఆర్ఎస్ పార్టీ మండిపడింది.  స్పీకర్ వైఖరి..సీఎం వాడిన భాషకు నిరసనగా  అసెంబ్లీని బహిష్కరిస్తున్నామని హరీష్ రావు ప్రకటించారు. మూసి ప్రక్షాళన అంశంపై సభలో జరిగిన చర్చ తర్వాత బీఆర్ఎస్ ఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది. 

ఈ నిర్ణయం తీసుకునే ముందు అసెంబ్లీలో హరీష్ మాట్లాడారు. తమపై వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే మైక్ కట్ చేసి ప్రతిపక్షాల గొంతు గొంతునొక్కుతున్నారని ఆరోపించారు.  ఈ సభలో అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా ఎమ్మెల్యేలందరికీ సమాన హక్కులు ఉంటాయని.. ఆ హక్కులను కాపాడాల్సిన  బాధ్యత  స్పీకర్ పై ఉందన్నారు. మా గొంతు నొక్కుతున్నప్పుడు, మా హక్కులకు భంగం కలుగుతున్నప్పుడు స్పీకర్ ప్రతిపక్షాన్ని రక్షించాలన్నారు. 

బీఏసీ సమావేశంలో  అసెంబ్లీ సమావేశాలు కనీసం 7 రోజుల పాటు నడుపుతామని అందరి సమక్షంలో నిర్ణయించాము.  ఆ తర్వాత అవసరాన్ని బట్టి మళ్ళీ బీఏసీ మీటింగ్ పెట్టి పొడిగింపుపై నిర్ణయిద్దామని అనుకున్నాం. కానీ ఆశ్చర్యకరంగా బీఏసీ మినిట్స్ లో ఆ ఏడు రోజుల ప్రస్తావన ఎందుకు పొందుపరచలేదు. సభలో తీసుకున్న నిర్ణయానికి మినిట్స్ లో పొంతన లేకపోతే ఎలా.. అని ప్రశ్నించారు. సభలో జరగబోయే బిజినెస్ గురించి, అజెండా కాపీలను తెల్లవారుజామున 2, 3 గంటలకు పంపిస్తున్నారు. సభ్యులు ఎప్పుడు నిద్రలేవాలి, ఎప్పుడు చదువుకోవాలి.. సబ్జెక్ట్ మీద ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలని హరీష్ రావు ప్రశ్నించారు.  సభ ప్రారంభానికి కనీసం 24 గంటల ముందు ఎజెండాను సభ్యులకు పంపాలనేది ఈ సభ ఆనవాయితీ అని గుర్తు చేశారు. 

ఆ సాంప్రదాయాన్ని ఎందుకు పాటించడం లేదు. దీనివల్ల అర్ధవంతమైన చర్చకు ఆస్కారం లేకుండా పోతోందన్నారు. మేము ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే మాకు సమాధానం చెప్పాల్సింది పోయి... సభా నాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి లేచి సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారని హరీష్ రావు విమర్శించారు. మేము అడిగిన ఏ ఒక్క పాయింట్‌కు సీఎం   దగ్గర క్లారిఫికేషన్ లేదు. పైగా మాకు మైక్ ఇవ్వకుండా, మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రొటెస్ట్ చేయడం సభ్యుడి హక్కు. మాకు మైక్ ఇవ్వకపోవడం ముమ్మాటికీ సరికాదన్నారు.  మూసీ నది కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువగా ఉంది. సభా నాయకుడి హోదాలో ఉండి ఆయన మాట్లాడుతున్న భాష వినడానికే చాలా కష్టంగా, అసహ్యంగా ఉందన్నారు.      

ఆ తర్వాత  నొక్కుతున్న స్పీకర్ పక్షపాత వైఖరిపై.. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి గన్​పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన వ్యక్తం చేశారు. సభను బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. మంగళవారం సభలో పీపీటీ ఉన్నందున.. బీఆర్ఎస్ హాజరు కాకపోతే కాంగ్రెస్ వాదన మాత్రమే వినిపించే అవకాశం ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Konda Surekha Out: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
Konda Surekha: సాయంత్రంలోగా రాజీనామా? లేదంటే బర్తరఫ్? - కొండా సురేఖకు అధిష్ఠానం అల్టిమేటం!
సాయంత్రంలోగా రాజీనామా? లేదంటే బర్తరఫ్? - కొండా సురేఖకు అధిష్ఠానం అల్టిమేటం!
Telangana Cabinet Reshuffle: కొండా సురేఖ వివాదం కాంగ్రెస్‌లో సునామీగా మారుతోందా? తిరుగుబాటు దేనికి సంకేతం?
కొండా సురేఖ వివాదం కాంగ్రెస్‌లో సునామీగా మారుతోందా? తిరుగుబాటు దేనికి సంకేతం?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 3 | సంజూ రాజకీయాన్ని దెబ్బకొట్టిన మీనా
Asian Games Accommodation Issue | ఏషియన్ గేమ్స్‌ వివాదంపై జపాన్ క్రికెట్ కామెంట్స్
Vaibhav Creates History In Duleep Trophy | దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ ఆల్ టైమ్ రికార్డ్
IND vs AFG T20s | అఫ్గాన్‌ సిరీస్‌ పై కృనాల్ పాండ్యా పోస్ట్ వైరల్
Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Meeting: పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
AP Local Elections: స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. టీడీపీ ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
Konda Surekha: నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Konda Surekha Out: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
AP IPS Officers Suspension Lifted: ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
Abhinandan Varthaman: ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
YS Jagan: సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
Son Kills Father Chittoor: తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
Embed widget