ఫెర్టిలిటీ సమస్య ఉన్నవారు ఈ ఫుడ్స్ తీనకూడదట.. ముఖ్యంగా మగవారు ప్రెగ్నెన్సీ కావడంలో ఇబ్బందులు ఉన్నప్పుడు ఫెర్టిలిటీకి ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఈ చికిత్స జరుగుతున్న సమయంలో కొన్ని ఫుడ్స్ తీసుకోకూడదంటున్నారు నిపుణులు. ట్యూనా చేపలు స్పెర్మ్‌పై ప్రతికూలంగా ప్రభావం చూపిస్తాయట. దీనిని మహిళలు కూడా తీసుకోకూడదంటున్నారు. ప్రాసెస్ చేసిన మీట్ స్పెర్మ్ కౌంట్‌ని తగ్గిస్తుంది అంటున్నారు. సోయాలోని ఈస్ట్రోజెనిక్ లక్షణాలు స్పెర్మ్ కౌంట్‌పై ప్రతికూలంగా స్పందిస్తుందని చెప్తున్నారు. ఆల్కహాల్ కూడా ఫెర్టిలిటీ సమస్యలను తీవ్రం చేస్తుంది. స్మోకింగ్ అలవాటు ఉంటే.. మళ్లీ దానిని వెంటనే ముగించాలంటున్నారు. ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యులను సంప్రదిస్తే మంచిది. (Images Source : Envato)