ఈ సమస్య ఉంటే మామిడిపండ్లు తినవచ్చా? జీవక్రియ సమస్యల కారణంగా ఆమ్లత్వం పెరుగుతుంది. మామిడి పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారు మామిడిపండ్లు తినాలా వద్దా అనే గందరగోళంలో ఉంటారు. పోషకాహార నిపుణుల ప్రకారం మామడిపండ్లను ఎక్కువగా తినడం వల్ల షుగర్ లెవల్స్ పెరుగుతాయి. మామిడిపండ్లు తింటే ఫ్రక్టోజ్ పెరుగుతుంది. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిని కూడా పెంచుతుంది. అంతేకాదు లివర్, గౌట్ సమస్యలను కూడా పెంచుతుంది. శరీరం ఫ్రక్టోజ్ ను విచ్ఛిన్నం చేసినప్పుడు ఫ్యూరిన్లు విడుదలవుతాయి. ఇది యూరిక్ యాసిడ్ పెరుగుదలకు దారితీస్తుంది. యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారు మామిడిపండ్లు తింటే వాపు, నొప్పి సమస్య పెరుగుతుంది. అధిక యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు మామిడిపండ్లు తినవచ్చు కానీ మితంగా తినాలి. వారానికి రెండు సార్లు తక్కువ మోతాదులో మామిడిపండ్లను తినవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే.