పానీపూరి తింటే ఎన్ని లాభాలో తెలుసా? పానీపూరి ఆరోగ్యానికి మంచిది కాదని అనుకుంటారు. కానీ, దాని ప్రయోజనాలు తెలిస్తే ఔరా అంటారు. పానీపూరి మితంగా తింటే బరువు తగ్గుతారని డైటీషియన్లు చెబుతున్నారు. పానీపూరి తింటే ఎసిడిటీ, జీర్ణక్రియ సమస్యలును తగ్గుతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను పానీపూరి కంట్రోల్లో ఉంచుతుంది. పానీపూరిలో పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, ఫొలేట్, విటమిన్లు ఎ, బి6, బి12, సి,డి ఉన్నాయి. ఇందులో ఐరన్ ఉంటుంది. పానీపూరి తింటే ఐరన్ లోపం నుంచి బయట పడవచ్చు. ఇందులో అల్లం, పుదీనా, బ్లాక్ సాల్ట్, కొత్తిమీర, జీలకర్ర, మిరియాలు కూడా వాడతారు. ఇవి కడుపు నొప్పి తగ్గించడంతోపాటు నోటిదుర్వాసన, నోటి సమస్యలకు చికిత్సగా పనిచేస్తుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.