మనలో చాయ్ ప్రియులు చాలా మందే ఉంటారు. చాయ్ మితంగా తాగితే మంచిదే. కొన్ని పదార్థాలు మాత్రం చాయ్‌తో కలిపి తీసుకోవద్దట. చిప్స్ వంటి సాల్టెడ్ స్నాక్స్ చాయ్ తో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా చెరుపు చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేకులు, డోనట్స్, చాక్లేట్ల వంటి స్వీట్స్ చాయ్ తో తీసుకోవద్దు. దీనితో రక్తంలో షుగర్ చాలా పెరిగిపోతుంది. పండ్లు చాలా పోషకాలు కలిగి ఉంటాయి. వీటిని చాయ్ తో తీసుకుంటే ఈ పోషకాలు శోషించుకోవు. ఐరన్ కలిగిన ఆహారాలు కూడా టీతో తీసుకోవద్దు. చాయ్ ఐరన్ శోషణకు అడ్డు తగులుతుంది. మిర్చిబజ్జీ, ఆనియన్ పకోడి, సమోసా వంటి స్నాక్స్ కూడా టీతో తీసుకుంటే అవి అరిగేందుకు చాలా సమయం పడుతుంది. నిమ్మ, ఆరెంజ్ వంటి ఆసిడిక్ లక్షణాలు కలిగిన పదార్థాలు కూడా టీతోకలిపి తీసుకోవద్దు. ఇవి చాయ్ లోని కెటాచిన్ శోషణను అడ్డుకుంటాయి. పాలతో కలిపి చాయ్ తీసుకుంటే చాయ్ లోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అందవు. వీలైనంత వరకు పాలు కలపని చాయ్ తాగడం మంచిది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. Image Credit: Pexels and Pixabay