బెండకాయల గురించి ఈ అపోహలు వద్దు బెండకాయలో పోషకాలు లేవు అనేది అపోహ మాత్రమే. బెండకాయలో కరిగే, కరగని ఫైబర్, ఫొలిక్ యాసిడ్, విటమిన్లు బి5,సి, ఏ, ప్రొటీన్లు నిండి ఉన్నాయి. బెండకాయలో నిల్వ ఉండాలంటే రిఫ్రిజిరేటర్ లో పెట్టాలనేది అపోహ. బెండకాయలను గది ఉష్ణోగ్రతలో ఉంచినా దానిలో పోషకపదార్ధాలు ఉంటాయి. బెండకాయను ఫ్రై చేయడం మాత్రమే ఉత్తమ మార్గం అనుకుంటే పొరపాటే బెండకాయను కర్రీ, ఉప్పు, మిరియాలు వేసి కాల్చుకోవచ్చు. ఆవిరితో ఉడకపెట్టవచ్చు, ఉడికించి తినవచ్చు. బెండకాయలు వండుకుని తింటేనే పోషకాలు అందుతాయనడం అపోహ. పచ్చిబెండకాయలో ఎక్కువ ప్రొటీన్ ఉంటుంది. వంద గ్రాములకు 2 గ్రాములు ఉంటుంది.