తెల్ల రక్తకణాలు పెరగాలంటే ఈ ఫుడ్స్ తినాల్సిందే సిట్రస్ పండ్లు తింటే తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది. వీటిలో విటమిన్ సి ఉంటుంది. బెర్రీస్ లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. స్టాబ్రెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్పెబెర్రీలు తింటే రక్తకణాలు పెరుగుతాయి. బచ్చలికూర, కాలే, స్విస్ చార్డ్ వంటి ఆకుకూరలు ఆరోగ్యకరమైన తెల్లరక్తకణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. పెరుగు, గట్ ఆరోగ్యాన్ని పెంచడంతోపాటు ఇమ్యూనిటీని మెరుగుపరుస్తుంది. పెరుగులో ప్రోబయెటిక్స్ పుష్కలంగా ఉంటాయి. బెల్ పెప్పర్స్ తెల్లరక్తకణాల ఉత్పత్తిని కూడా మెరుగుపరుస్తుంది. ఇందులో విటమిన్ సి, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. వెల్లుల్లిని సూపర్ ఫుడ్ అంటుంటారు. ఇమ్యూనిటిని పెంచడంతోపాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అల్లంలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడి ఇమ్యూనిటీ పనితీరు మెరుగుపరుస్తుంది. పసుపు కర్కుమిన్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రభావాలను కలిగి ఉంటుంది. తెల్లరక్తకణాలను పెంచడంలో సహాయపడుతుంది.