సాల్మన్ వంటి చేపలు తింటే ఇన్ఫ్లమేషన్ ఉండదు, చర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది. చర్మం సాగే గుణం కోల్పోదు.

బచ్చలి, పాలకూర తింటే చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఫ్రీరాడికల్ స్ట్రెస్ తగ్గుతుంది.

బ్లూబెర్రీలు ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గిస్తాయి. చర్మం మీద ముడుతలు, సన్నని గీతలు రాకుండా నివారిస్తాయి.

టమాటల్లోని లైకోపిన్ వల్ల చర్మం కణాలను త్వరగా రిపేర్ చేస్తాయి. చర్మం టెక్చర్, టోన్ ను కాపాడుతాయి.

చిలగడదుంపలు తింటే చర్మం మీద సూర్యరశ్మి వల్ల కలిగిన నష్టాన్ని తగ్గిస్తాయి. చర్మ కణాలను రిపేర్ చేస్తాయి.

బాదాములు, వాల్నట్స్ వంటివి తింటే చర్మం సాగే గుణం కోల్పోదు. త్వరగా వృద్ధాప్య ఛాయలు దరిచేరవు.

రోజూ గ్రీన్ టీ తాగితే చర్మాన్ని యూవీ కిరణాల నష్టం నుంచి కాపాడుతుంది. త్వరగా ఏజింగ్ కాకుండా నివారిస్తుంది.

అవకాడోతో చర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది. చర్మం బిగుతుగా మారుతుంది. వయసు ప్రభావంతో ఏర్పడిన మచ్చలు తొలగిపోతాయి.

బ్రొకొలితో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఆక్సిడేటివ్ నష్టం నుంచి కాపాడుతుంది. చర్మం రంగు తగ్గకుండా రక్షిస్తుంది.

Image Source: Pexels

ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే.