విటమిన్ D సరిపడినంతం ఉండడం ఆరోగ్యానికి చాలా అవసరం. ఒక్కోసారి ఈ పోషక లోపం ప్రమాదకరంగా కూడా మారుతుంది. విటమిన్ D లోపాన్ని సరిచేసుకునేందుకు సూర్యరశ్మిలో సమయం గడపాలనే సలహా ఇస్తుంటారు డాక్టర్లు. కానీ ఎండలో గడపడం చాలా మందికి పెద్దగా నచ్చదు. అలాంటపుడు ఆహారం ద్వారా ఈ లోపాన్ని సరిచేసుకోవచ్చు. ఉడికిండచిన గుడ్డు తినడం వల్ల విటమిన్ D తగినంత లభిస్తుంది. పుట్టగొడుగుల్లో కూడా విటమిన్ D లభిస్తుంది. పాలలో కూడా విటమిన్ D పుష్కలంగా ఉంటుంది. విటమిన్ D సీ ఫూడ్ ఆయిస్టర్ లో కూడా లభిస్తుంది. ఇందులో విటమిన్ B2 డా ఉంటుంది. చేపనూనెలో కూడా విటమిన్ D దొరుకుతుంది. కనుక ఫ్యాటీ ఫిష్ తీసుకోవడం మంచిది. వీటన్నింటితో పాటు ప్రతిరోజు కనీసం 10 నిమిషాల పాటు సూర్యరశ్మిలో గడపడం కూడా చాలా అవసరం. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే