యాపిల్ ఇలా తింటే పీరియడ్స్ నొప్పి ఉండదా.. నిజమా? ఈ రోజుల్లో సోషల్ మీడియాలో బోలెడంత సమాచారం సర్య్కులేట్ అవుతోంది. ఎవరికి తోచిన సమాచారాన్ని వారు షేర్ చేస్తున్నారు. వీటిలో నిజాలకంటే అపోహలే ఎక్కువగా ఉంటాయి. పీల్ తీసిన యాపిల్ తింటే పీరియడ్స్ నొప్పి తగ్గుతుందని..మానసిక స్థితి మెరుగుపడుతుందని అంటున్నారు. పీరియడ్స్ పేయిన్స్ అనేది హార్మోన్ల హెచ్చుతగ్గులతో ముడిపడి ఉంటుంది. యాపిల్స్ లో విటమిన్ సి, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మూడ్ రెగ్యులేషన్ కు ఇన్ ఫ్లుయెన్సర్లుగా ఉన్నాయి. కొంతమందికి యాపిల్స్ మూడ్ బూస్ట్ గా పనిచేస్తాయి. ఇంకొందరికి అలాంటి ప్రభావం కనిపించకపోవచ్చు. యాపిల్ తొక్క తీసి తింటే కొన్ని ప్రయోజనాలు కోల్పోవచ్చు. తొక్కలో అదనపు పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.