చాయ్ ఎక్కువగా మరిగించి తాగుతున్నారా? ప్రమాదంలో పడ్డట్లే చాయ్ ను ఎక్కువ సేపు మరిగించి తాగడం చాలా మందికి అలవాటు. టీని ఎక్కువగా మరిగిస్తే ఏమౌతుందో చూద్దాం. చాయ్ ని ఎక్కువసేపు మరిగిస్తే పాలలో ఉండే విటమిన్లు, బి12 పోషకాలు క్షీణిస్తాయి. పాలను ఎక్కువ సేపు మరిగిస్తే కాలిన వాసన వస్తుంది. చాయ్ రుచి కూడా మారుతుంది. పాలలోని లాక్టోస్ ఇతర ప్రోటీన్లతో చర్య జరుపుతుంది. ఇది ప్రమాదకరమైన మిశ్రమాలను విడుదల చేస్తుంది. టీని ఎక్కువ సేపు మరిగిస్తే కాటెచిన్లు, పాలీఫెనాల్స్ వంటి సాల్యుటరీ మిశ్రమాలు విచ్ఛిన్నమవుతాయి. ఎక్కువ సేపు మరిగించడం వల్ల యాక్రిలామైడ్ వంటి మిశ్రమాలు ఉత్పత్తి అవుతాయి. ఎక్కువగా మరిగిస్తే పాలలోని ప్రొటీన్లు డీనాటరేషన్ కు దారి తీస్తాయి. వాటి నిర్మాణాన్ని మార్చడంతోపాటు జీర్ణం కావు. చాయ్ పీహెచ్ స్థాయి మారుతుంది. గుండెల్లో మంట లేదా కడుపులో అసౌకర్యం వంటి లక్షణాలను పెంచుతుంది.