నెయ్యిని ఎక్కువగా వేడి చేస్తే ఏమౌతుందో తెలుసా భారతీయుల వంటకాల్లో నెయ్యి తప్పనిసరిగా ఉంటుంది. నెయ్యి రుచి అద్భుతంగా ఉంటుంది. నెయ్యిని వేడి చేసినప్పుడు పాన్ నుంచి వచ్చే పొగ చాలా ప్రమాదకరం. నెయ్యిని ఎక్కువగా వేడి చేస్తే వచ్చే పొగ ఆరోగ్యానికి హానికరమని ప్రముఖ డైటిషన్లు చెబుతున్నారు. నెయ్యి లేదా నూనెల నుంచి వచ్చే పొగ కంటే వేడి చేయడం వల్ల ఆల్డిహైడ్స్ , హైడ్రోకార్బన్స్ ఫ్రీరాడికల్స్ ఏర్పడతాయి. ఇవి శరీరంలో మంటను పెంచుతాయి. గుండె జబ్బులు, కొన్ని క్యాన్సర్లు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. శ్వాసకోశ సమస్యలు, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించేందుకు గర్భిణీలు ఎక్కువ స్మోక్ పాయింట్ నూనెలతో జాగ్రత్తగా ఉండాలి. స్మోక్ పాయింట్ తగ్గించాలంటే నూనె కానీ నెయ్యి కానీ అతిగా వేడి చేయకూడదు. వంటకు తగ్గట్లుగా నూనెను వేడి చేస్తే అందులోని యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్య ప్రమాదాలను తగ్గిస్తాయి.