సమతుల ఆహారానికి, ఆరోగ్యకర ఆహారానికి అంత తేడా ఉందా?
సమతుల ఆహారంలో రకరకాల పోషకాలతో కూడిన పదార్థాలు ఉంటాయి.
ఆరోగ్యకరమైన ఆహారంలో అవసరానికి తగిన పోషకాలు ఉంటాయి.
రెండు రకాల ఆహారాలు కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే.
ప్రత్యేక అవసరాల కోసం కొన్ని రకాల పోషకాల మీద మాత్రమే దృష్టి నిలుపుతాము.
కొవ్వులు, కార్బోహైడ్రేట్లు తీసుకోకపోతే పోషకాహార లోపాలు ఏర్పడవచ్చు.
పోర్షన్ కంట్రోల్ చాలా ముఖ్యం. ఆహారంలో పోషకాలు అసమతుల్యం అవుతాయి.
చిక్కుళ్లు, పప్పులు, గింజధాన్యాలు, పాలు, గుడ్లు, చేపలను ఆహారంలో చేర్చుకోవాలి.
నెయ్యి, ఆవనూనె, కొబ్బరినూనె మెదడు ఆరోగ్యానికి, హార్మోన్ల సమతుల్యానికి అవసరం.
పసుపు, జీలకర్ర, అల్లం పోషకాలను, ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
నీళ్లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు, కొన్ని రకాల హెర్బల్ టీలు ఆరోగ్యానికి అవసరం.
ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.