నీళ్లలో నానబెట్టిన అంజీర్ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నానబెట్టిన అంజీర్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి మేలు చేస్తంది. అంజీర్ లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. పాలీఫెనాయిడ్లు ఇన్ఫ్లమేషన్ నుంచి కాపాడతాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తాయి. అంజీర్ లో పొటాషియం తగినంత ఉంటుంది. గుండె, రక్తనాళాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంజీర్ లో ఉండే ఫైబర్ వల్ల రక్తంలో షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి. మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాల్షియం ఉండడం వల్ల అంజీర్ ఎముకల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అంజీర్ తో ఆకలి మందగిస్తుంది. కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలిగిస్తుంది. కనుక బరువు అదుపులో ఉంటుంది. ఈ సమాాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.