Image Source: pexels

డయాబెటిస్ బాధితులు రోజుకు ఎన్ని మామిడి పండ్లు తినవచ్చు?

మామిడిపండ్లను చూడగానే నోరూరుతుంది. కానీ మధుమేహం రోగులు ఇష్టానుసారం వీటిని తినకూడదు.

డయాబెటిస్ పేషంట్లు మామిడిపండ్లు తినాలా ? వద్దా ? అనే అయోమయంలో ఉంటారు.

డైటీషియన్ల తెలిపిన వివరాల ప్రకారం.. డయాబెటిస్ పేషంట్లు కూడా మామిడిపండ్లు తినవచ్చు.

షుగర్ పేషంట్లు ప్రతిరోజూ 100 గ్రాముల మామిడిపండ్లను తినవచ్చు.

అంటే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు రోజూ అరకప్పు మామిడిపండ్లు తినాలని చెబుతున్నారు.

మీ కేలరీలను బట్టి మామిడిపండ్లు ఎక్కువ పరిమాణం లేదా తక్కువ పరిమాణం తీసుకోవచ్చు.

మామిడిలో గ్లైసెమిక్ ఇండెక్స్ 51 ఉంటుంది. కాబట్టి షుగర్ పేషంట్లు తినవచ్చు.

మామిడిలో ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వెంటనే షుగర్ లెవల్స్ ను పెంచదు.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.