వేసవిలో తినాల్సిన పచ్చళ్లు ఇవే వేసవి అనగానే మామిడి పచ్చడి గుర్తుకు వస్తుంది. భారతదేశంలో ఈ పచ్చడి ఎంతో ఇష్టంగా తింటారు. నిమ్మకాయ పచ్చడి కొద్దిగా ఉప్పగా, తీపిగా, పుల్లగా ఉంటుంది. ఈ పచ్చడి తింటే వేసవిలో రిఫ్రెష్ గా ఉంటుంది. క్యారెట్, కాలీఫ్లవర్,టర్నిప్ వంటి కూరగాయలతో మిక్డ్స్ వెజిటబుల్ పచ్చడి చేస్తారు. తాజా పచ్చిమిరపకాయలతో తయారు చేసే ఊరగాయ అంటే చాలా మందికి ఇష్టం. వేడి వేడి అన్నంలో తింటే బాగుంటుంది. ఉసిరి పచ్చడి చాలా ఘాటుగా ఉంటుంది. వేసవిలో భోజనంలో తింటే రుచితోపాటు పోషకాలు అందుతాయి. వెల్లుల్లి ఊరగాయ చాలా ఫేమస్. సుగంధ ద్రవ్యాలతో చేస్తారు. పప్పులో కలుపుకుని తింటే రుచి అద్బుతంగా ఉంటుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే.