10-Minute Smartphone Delivery: స్మార్ట్ ఫోన్ ఆర్డర్ చేస్తే 10 నిమిషాల్లో హోమ్ డెలివెరీ - స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ దూకుడు
Smartphone Delivery In 10 Minutes: ఎంపిక చేసిన నగరాల్లో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ 10 నిమిషాల స్మార్ట్‌ఫోన్ డెలివరీ సర్వీస్‌ను ప్రారంభించింది. చాలా బ్రాండ్ ఫోన్‌లు దీని బాస్కెట్‌లో ఉన్నాయి.

Swiggy Instamart 10-Minute Smartphone Delivery Service: చిటికె వేసినంత సమయంలో స్మార్ట్ ఫోన్ కొనొచ్చు అంటే అతిశయోక్తిగా ఉంటుందేమోగానీ, అతి తక్కువ సమయంలో స్మార్ట్‌ఫోన్‌ను హోమ్ డెలివెరీ పొందొచ్చు అంటే మాత్రం అతిశయోక్తి కాదు. మన దేశంలో, స్మార్ట్‌ఫోన్‌ల కోసం స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఫాస్ట్ డెలివరీ సర్వీస్‌ను ప్రారంభించింది. ఈ క్విక్ డెలివరీ ప్లాట్‌ఫామ్ (Quick Delivery Platform Swiggy Instamart)... ఆపిల్ (Apple), శామ్‌సంగ్ (Samsung), వన్‌ప్లస్ (OnePlus), రెడ్‌మి (Redmi) వంటి బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లను కస్టమర్లకు డెలివెరీ చేస్తోంది. ప్రస్తుతం ఈ సర్వీస్ కొన్ని నగరాలకే పరిమితం అయినప్పటికీ, త్వరలో ఎక్కువ ప్రాంతాలకు విస్తరించేందుకు కంపెనీ ప్లాన్ చేసింది. ఆపిల్ నుంచి ఇటీవలే లాంచ్ అయిన iPhone 16e ని కూడా వినియోగదారులు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ చేయవచ్చు. ఆర్డర్ అందుకున్న 10 నిమిషాల్లోనే స్మార్ట్‌ఫోన్‌లు డెలివరీ అవుతాయని స్విగ్గీ ప్రకటించింది. ఇన్‌స్టామార్ట్‌లో స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసేవారు పేమెంట్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు.
10 నగరాల్లో స్మార్ట్‌ఫోన్‌లను డెలివరీ
ప్రస్తుతానికి 10 భారతీయ నగరాల్లో 10 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్‌ల డెలివరీని ప్రారంభించినట్లు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ప్రకటించింది. అవి - హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, దిల్లీ, ముంబై, ఫరీదాబాద్, నోయిడా, గుర్గావ్, కోల్‌కతా, పుణె.
ఏయే బ్రాండ్ ఫోన్లు ఆర్డర్ చేయొచ్చు?
ఈ 10 నగరాల్లో - ఐఫోన్‌ల 16ఇ (iPhone 16e), శామ్‌సంగ్ గెలాక్సీ ఎం35 (Samsung Galaxy M35), ఒన్‌ప్లస్ నార్డ్ సీఈ (OnePlus Nord CE), ఒన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ (OnePlus Nord CE 4 Lite), రెడ్‌మి 14సి (Redmi 14C) వంటి స్మార్ట్‌ఫోన్‌లను ఆర్డర్ చేసి 10 నిమిషాల్లో ఇంటి వద్దకే తెప్పించుకోవచ్చు. ఈ సర్వీస్ త్వరలో మరిన్ని నగరాలకు అందుబాటులోకి వస్తుందని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వెల్లడించింది.
మోటరోలా (Motorola), ఒప్పో (Oppo), వివో (Vivo), రియల్‌మి (Realme) వంటి బ్రాండ్‌ల మొబైల్ ఫోన్‌లు కూడా ఇన్‌స్టామార్ట్‌లో క్విక్ డెలివరీకి అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ బ్రాండ్స్‌లో ఏయే మోడల్ ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయన్న విషయాన్ని కంపెనీ వెల్లడించలేరు.
పేమెంట్ ఆఫర్లు కూడా వర్తింపు
వినియోగదారులు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి మొబైల్ ఫోన్‌ల విభాగంలో రూ. 11,499 కంటే ఎక్కువ ఆర్డర్ చేస్తే, 5 శాతం లేదా రూ.4,000 వరకు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
బ్లింకిట్, జెప్టో సర్వీస్‌లు కూడా
క్విక్ కామర్స్ విభాగంలో ఇన్‌స్టామార్ట్‌కు పోటీగా ఉన్న బ్లింకిట్ (Blinkit), జెప్టో (Zepto) కూడా ప్రస్తుతం చాలా నగరాల్లో స్మార్ట్‌ఫోన్ డెలివరీ సర్వీస్‌లను అందిస్తున్నాయి. ఈ రెండు బ్రాండ్‌లు కూడా ఇటీవల ఆపిల్‌తో చేతులు కలిపాయి, ఆపిల్ ఉత్పత్తులను ఇంటి వద్దకే డెలివరీ చేయడానికి ముందుకు వచ్చాయి. జెప్టో, ఎంపిక చేసిన నగరాల్లో వివో స్మార్ట్‌ఫోన్‌లు, ఆసుస్ కీబోర్డులు & మౌస్‌లను డెలివరీ చేస్తోంది. బ్లింకిట్, శామ్‌సంగ్ గెలాక్సీ S24 సిరీస్, ప్లేస్టేషన్ 5, బంగారం & వెండి నాణేలను విక్రయిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

