Shreyas Iyer Ishan Kishan BCCI Contracts | ఐపీఎల్ ఆడినంత మాత్రాన కాంట్రాకులు ఇచ్చేస్తారా | ABP Desam
ఐపీఎల్ మహా సంగ్రామం మొదలైపోయింది. అన్ని జట్లు ఇప్పటికే ఒక మ్యాచ్ ఆడేశాయి. ఈ టీ20 యుద్ధంలో ఆకలితో ఉన్న సింహాలన్నీ నిద్రలేచి వేటాడుతున్నాయి. అలా ఇప్పటి వరకూ ఇషాన్ కిషన్, అశుతోష్ శర్మ, శ్రేయస్ అయ్యర్ దుమ్ము లేపారు దంచికొట్టారు. ఇప్పుడు అసలు మేటర్ ఏంటంటే రేపో మాపో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల లిస్ట్ రానుంది. మొన్న రాత్రి బీసీసీఐ మహిళల కాంట్రాక్ట్ లిస్ట్ విడుదల చేసిన బీసీసీఐ..పురుషుల కాంట్రాక్ట్ లిస్ట్ కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. ఆఖరి నిమిషాల్లో మార్పులు ఉంటే తప్ప ఇప్పటికే జాబితా సిద్ధమైపోయిందని బీసీసీఐ అంతర్గత సమాచారం. అయితే ఇప్పుడు ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ లకు కాంట్రాక్టు దక్కుతుందా లేదా అని. ఎందుకంటే 2024లో బీసీసీఐ ఓ కఠినమైన నిర్ణయం తీసుకుంది. క్రమశిక్షణా చర్యల కింద శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లను కాంట్రాక్టు జాబితా నుంచి తొలగించింది బీసీసీఐ. బ్యాకప్ కీపర్ ను తెప్పించారని అలిగి వెళ్లిపోయిన ఇషాన్ కిషన్ మీద సీరియస్ అయిన బీసీసీఐ...ఇంజ్యూర్ కాకపోయినా అయ్యిందని చెప్పి సిరీస్ నుంచి వైదొలగిన అయ్యర్ ను వదిలిపెట్టలేదు. వీళ్లిద్దరి కాంట్రాక్టులు తీసేస్తున్నామని..వీళ్లు కనుక మళ్లీ టీమిండియా తరపున ఆడాలంటే దేశవాళీ మ్యాచుల్లో ఆడి తమను తాము ప్రూవ్ చేసుకుని రావాలని చెప్పింది. ఈ మాటను పెడచెవిన పెట్టిన ఇషాన కిషన్ ఇప్పటివరకూ డొమెస్టిక్ క్రికెట్ ఆడలేదు. కానీ ఐపీఎల్ లో మాత్రం ఆడుకుంటున్నాడు. గతేడాది ముంబైకి ఆడిన ఇషాన్..ఈ ఏడాది సన్ రైజర్స్ కి మారాడు. వచ్చీ రావటంతోనే కాటేరమ్మ ఆఖరి కొడుకులా పవర్ ఫుల్ సెంచరీతో రాజస్థాన్ పై విరుచుకుపడ్డాడు. నిన్న అయ్యర్ కూడా అంతే. గుజరాత్ టైటాన్స్ మీద 97పరుగుల ఫైరీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక్కడ మేటర్ ఏంటంటే దేశావాళీ మ్యాచుల్లో ఆడిన కారణంగా గతేడాది శ్రేయస్ అయ్యర్ ను టీమిండియా కు బీసీసీఐ కన్సిడర్ చేసింది. ఫలితంగా ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఆడి గెలిచాడు శ్రేయస్ అయ్యర్. కానీ బీసీసీఐ కాంట్రాక్టు మాత్రం దక్కలేదు. మరి ఇషాన్, అయ్యర్ ల ప్రదర్శన చూసి బీసీసీఐ కాంట్రాక్టును ఇస్తుందా లేదా ఐపీఎల్ మ్యాచులకు టీమిండియా లో ఆడటానికి సంబంధం ఏంటని లైట్ తీసుకుంటుందా చూడాలి.





















