అన్వేషించండి
YS Jagan Latest News: విజయవాడలో ఇఫ్తార్ విందుకు హాజరైన వైఎస్సార్‌సీపీ అధినేత జగన్
YS Jagan Latest News: వైసీపీ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన ఇఫ్తార్ విందులో ఆ పార్టీ అధినేత జగన్ పాల్గొన్నారు. ప్రార్థనల్లో పాల్గొని ముస్లింలకు పండగ శుభాకాంక్షలు చెప్పారు.
విజయవాడలో ఇఫ్తార్ విందుకు హాజరైన వైఎస్సార్‌సీపీ అధినేత జగన్
1/16

పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.
2/16

ఈ ఇఫ్తార్ విందును విజయవాడ ఎన్‌ఏసీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేశారు.
3/16

వైసీపీ ఆధ్వర్యంలో ఇచ్చే ఇఫ్తార్ విందుకు వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ హాజరయ్యారు.
4/16

ముస్లింలకు ఈద్ ముబారక్ అంటూ ఉర్ధూలో రంజాన్ ముందస్తు శుభాకాంక్షలు చెప్పిన వైఎస్ జగన్
5/16

ముస్లింలతో కలిసి వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
6/16

అందరి ప్రార్ధనలు సఫలం కావాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
7/16

అల్లా చల్లని ఆశీస్సులతో అందరూ బాగుండాలని జగన్ కోరుకున్నారు.
8/16

ముస్లిం సంప్రదాయం ప్రకారం టోపీ, పవిత్ర కండువా ధరించారు జగన్
9/16

ముస్లింలతో కలిసి వైఎస్ జగన్ నమాజ్ చేశారు
10/16

ప్రత్యేక ప్రార్థనల తర్వాత ముస్లింలతో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు.
11/16

వైసీపీ ఇచ్చిన ఇఫ్తార్ విందులో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
12/16

ముస్లిం మత పెద్దలు వైసీపీ పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు.
13/16

గతేడాది ముఖ్యమంత్రి హోదాలో వైసీపీ అధినేత జగన్ ఇఫ్తార్ విందు ఇచ్చారు.
14/16

ఈసారి మాజీ ముఖ్యమంత్రి హోదాలో పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఇచ్చారు.
15/16

అందర్నీ పలకరించిన జగన్ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
16/16

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైసీపీ ముస్లిం లీడర్లు కూడా ఈ విందులో పాల్గొన్నారు.
Published at : 26 Mar 2025 09:40 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















